Breaking News

గాజాలో శరణార్థులపై ఇజ్రాయెల్‌ దాడులు..26 మంది మృతి

Published on Wed, 12/11/2024 - 15:00

గాజా:ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇజ్రాయెల్‌ భీకర వైమానిక దాడుల్లో పాలస్తీనా పౌరులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 26 మంది శరణార్థులు మృతి చెందారు. ఈమేరకు పాలస్తీనా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం(డిసెంబర్‌ 10) అర్ధరాత్రి ఇజ్రాయెల్‌ సరిహద్దులోని బీట్‌ లాహియాలో దాడులు జరిగాయి.

శరణార్థులు ఆశ్రయం పొందుతున్న శిబిరంపై దాడి జరగడంతో 19 మంది మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్‌ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపైనా దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

అయితే, ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్  ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేయడంతో సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 40 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు.

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు