Breaking News

ఇజ్రాయెల్‌ దాడిలో 105 మంది మృతి

Published on Mon, 09/30/2024 - 09:23

బీరూట్‌ : లెబనాన్‌ తీవ్రవాద గ్రూప్‌ హెజ్‌బొల్లాను కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ వడివడిగా అడుగులు వేస్తోంది భూతల,వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా, లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో తొలిసారి జనావాసాల్లో హెజ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆదివారం జరిపిన దాడుల్లో సుమారు 105 మంది మరణించారు. 359 మందికిపైగా గాయపడ్డారు.

  • లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో ఘోరమైన వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. తూర్పు, దక్షిణ, బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాలలో డజన్ల కొద్దీ మంది మరణించారని చెప్పారు. 

  • సోమవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు.

  • రెండు వారాల క్రితం ఇజ్రాయెల్..హెజ్‌బొల్లా సభ్యులపై దాడుల ముమ్మరం చేసిన నాటి నుండి 1,000 మందికి పైగా మరణించారని, 6,000 మంది గాయపడ్డారని లెబనాన్ పేర్కొంది.

  • రాయిటర్స్ ప్రకారం, బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగిన ప్రాంతంలో హెజ్‌బొల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లాను మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది.  

  • ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌.. 20 మంది హెజ్‌బొల్లా అగ్రనేతల్ని హత మార్చింది. వారిలో నస్రల్లా,నబిల్‌ కౌక్‌తో పాటు ఇతర నేతలు ఉన్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ఐడీఎఫ్‌ ప్రకటించింది.  

  • ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్‌పై దాడిని కొనసాగించాలని ఆదేశించారు. హెజ్‌బొల్లాపై చేస్తున్న దాడుల కారణంగా సామాన్యులు నష్టపోకూడదని, వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)