Breaking News

గాజా ఘోరం: ఇజ్రాయెల్‌ కీలక ప్రకటన

Published on Fri, 03/01/2024 - 07:24

జెరూసలెం: గాజాలో ఆహారం కోసం ఎగబడిన సమయంలో జరిగిన కాల్పుల్లో  104 మంది మృతి చెందిన ఘటనపై ఇజ్రాయెల్‌ స్పందించిది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) శుక్రవారం అర్ధరాత్రి ఒక ప్రకటన చేసింది. పశ్చిమ గాజాలోని అల్‌ నబుసి ప్రాంతానికి  ఆహారం పంచడానికి ట్రక్కులు వచ్చినప్పుడు అక్కడి జనం ఒక్కసారిగా ఎగబడ్డారని తెలిపింది.  ఆహారం తీసుకువచ్చిన ట్రక్కుల కింద పడి నలిగిపోవడంతో పాటు తొక్కిసలాట కారణంగానే ఈ ఘటనలో ఎక్కువ మంది మరణించినట్లు తెలిపింది.

దీనికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) ఎక్స్‌(ట్విటర్‌)లో వీడియోలు విడుదల చేసింది. ‘ సాయం చేసే ట్రక్కులు రాగానే వాటిపై ఒక్కసారిగా వందల మంది ఎగబడ్డారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు వాహనాలను జనం మీదకు ఎక్కించారు. ఈ కారణంగా పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు చనిపోయారు’అని ఇజ్రాయెల్‌ తెలిపింది.

అయితే ఆహారం కోసం ఎగబడ్డ సమయంలో ఇజ్రాయెల్‌ సైన్యం కాల్పులు జరపడం వల్లే 104 మంది మృత్యువాత పడ్డారని వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కాల్పులను పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ ఖండించారు. ఇదొక భయంకరమైన ఊచకోత అని ఆయన అభివర్ణించారు. గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ ఉగ్రవాదులు దాడులు చేసినప్పటి నుంచి ఇజ్రాయెల్‌ పాలస్తీనాలోని గాజాపై బాంబులతో విరుచుకుపడటమే కాక గాజాను దాదాపు ఆక్రమించింది. 

ఇదీ చదవండి.. గాజాలో ఘోరం

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)