Breaking News

హమాస్‌ చెరలో ఇజ్రాయెల్‌ మహిళా సైనికులు! వీడియో విడుదల

Published on Thu, 05/23/2024 - 13:54

హమాస్‌ మిలిటెంట్లు గతేడాడి అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మరణించగా.. హమాస్‌ మిలిటెంట్లు 250 ఇజ్రాయల్‌ పౌరులను బంధీలుగా తీసుకువెళ్లారు. అయితే దాడి అనంతరం హమాస్‌  మిలిటెంట్లు  సరిహద్దులో ఉన్న ఐదుగురు ఇజ్రాయల్‌ మహిళా సైనికులను బంధీలుగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘బంధీల కుటుంబ ఫోరం’ విడుదల చేసింది.

ఆ వీడియోలో నహల్ ఓజ్ బేస్ వద్ద విధలు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్‌ మహిళా సైనికులు.. లిరి అల్బాగ్, కరీనా అరివ్, అగామ్ బెర్గర్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ తెలుస్తోంది. మహిళా సైనికులు గాయాలతో, వారి చేతులు కట్టేసి ఉండటం ఆ వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. అందులో ఒక హమాస్‌ మిలిటెంట్‌.. ఇజ్రాయెల్‌ మహిళా సైనికులను ఉద్దేశిస్తూ మీరంతా అమ్మాయిలు, మహిళలు. మీరు గర్భవతులు అవుతారు’అని అన్నాడు. మరో మిలిటెంట్‌ ‘నువ్వు ఎంతో అందంగా ఉన్నావు’అని అన్నాడు.

 

అందులో ఓ సైనికురాలు మాట్లాడుతూ.. ‘నాకు పాలస్తీనాలో స్నేహితులు ఉన్నారు’అని అన్నారు. దీంతో వెంటనే స్పందించిన  ఓ మిలిటెంట్‌.. ‘ మా సోదరులు ప్రాణాలు కోల్పోడానికి కారణం​ మీరే. మిమ్మల్ని  మేము కాల్చేస్తాం’అని అన్నాడు. ఈ వీడియోను విడుదల చేసిన ‘బంధీల కుటుంబ ఫోరం’ హమాస్‌ చెరలో ఉన్న బంధీలను వెంటెనే విడిపించాలని ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును డిమాండ్‌ చేస్తున్నారు.

ఇజ్రాయెల్‌ మహిళా సైనికులు ఇంకా హమాస్‌ చెరలోనే ఉన్నారు.  వారిలో చెరలో ఉన్న బంధీలను స్వదేశానికి రప్పించటంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవండని ప్రభుత్వ అధికార ప్రతినిధి డేవిడ్‌ మెన్సెర్‌ అన్నారు. ఇక.. ఈ వీడియోపై హమాస్‌ మిలిటెంట్లు స్పందించారు. ‘ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో నిజం కాదు. ఇజ్రాయెల్‌ కల్పిత కథనాల ప్రచారం. మహిళా సైనికులతో తప్పుగా ప్రవర్తించలేదు’అని వివరణ  ఇచ్చారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)