Breaking News

పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్‌

Published on Mon, 01/20/2025 - 09:05

టెల్‌అవీవ్‌:కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇటు ఇజ్రాయెల్‌ , అటు హమాస్‌ ఒప్పందం అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఒప్పదంలో భాగంగా ఇజ్రాయెల్‌ తాజాగా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇప్పటికే హమాస్‌ తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరుల్లో నుంచి ముగ్గురిని విడుదల చేసింది.

అనంతరం ఇజ్రాయెల్‌ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ఇజ్రాయెల్‌,హమాస్‌ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. ఇజ్రాయెల్,హమాస్‌ మధ్య విరమణ ఒప్పందం ఆదివారం ఉదయం అమల్లోకి వచ్చింది.

ఆరు వారాల్లో హమాస్‌ 33 మంది బందీలను, ఇజ్రాయెల్‌ దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వంలో భాగస్వామి ఓజ్మా యేహూదిత్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి ఆ పార్టీ వైదొలగింది. పార్టీకి చెందిన ముగ్గురు నేతలు ఇప్పటికే తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

2023 అక్టోబర్‌ 7న పాలస్తీనాకు చెందిన హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1200 మందిని చంపారు.కొంత మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు.దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ గాజాపై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇ‍ప్పటివరకు 47 వేల మంది దాకా మరణించినట్లు సమాచారం. తాజా కాల్పుల విరమణతో గాజాలో శాంతి నెలకొనే అవకాశాలున్నాయి.

 

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు