Breaking News

మీడియా సంస్థకు ఇజ్రాయెల్‌ సైనికుల వార్నింగ్‌

Published on Sun, 09/22/2024 - 11:12

గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వెస్ట్‌బ్యాంక్‌ రమల్లాలోని ఖతార్‌ బ్రాడ్‌కాస్టర్‌ అల్‌ జజీరా ఆఫీసులో ఆదివారం సోదాలు చేశారు ఇజ్రాయెల్‌ సైనికులు. ఒక్కసారిగా ముసుగులు ధరించిన ఇజ్రాయెల్‌ సైనికులు అల్‌ జజీరా భవనంలోకి ప్రవేశించారు. సిబ్బంది ఆఫీసులో ఉన్న కెమెరాలు తీసుకొని త్వరగా అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఛానెల్‌ ఆఫీసును మూసివేయాలని అల్‌ జజీరా నెట్‌వర్క్‌   వెస్ట్‌బ్యాంక్‌ బ్యూరో చీఫ్‌ వాలిద్‌ అల్‌ ఒమారీను ఆదేశించారు. ఛానెల్ ప్రసారాలను 45 రోజుల్లో పూర్తిగా నిలిపివేయాలని సైనికులు చెప్పగా.. ఆయన లైవ్‌లోనే చదివినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇక.. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తూ అల్‌ జజీరా కార్యకలాపాలను ఇజ్రాయెల్‌లో ప్రసారాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. మేలో నెలలో అల్ జజీరా.. తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్న జెరూసలేం హోటల్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఆదివారం ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.

బలవంతంగా 45 రోజుల్లో ప్రసారాలు పూర్తిగా నిలిపివేయాలని నిషేధం విధించడాన్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది. ఇది మానవ హక్కులు, సమాచారాన్ని పొందే ప్రాథమిక హక్కును ఉల్లంఘించే నేరపూరిత చర్య అని అభివర్ణించింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ మీడియాపై కొనసాగిస్తున్న అణచివేత అంతర్జాతీయ, మానవతా చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.

చదవండి: లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల విధ్వంసం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)