Breaking News

ఇజ్రాయెల్‌ Vs హమాస్‌.. నెతన్యాహు సంచలన ప్రకటన!

Published on Tue, 06/25/2024 - 08:32

టెల్‌ అవీవ్‌: హమాస్‌ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే గాజాలో పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే తాము అనుకూలంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. గాజాలో యుద్ధం దాదాపుగా ముగింపు దశలో ఉందన్నారు.

కాగా, నెతన్యాహు తాజాగా ఇజ్రాయెల్‌ ఓ మీడియా ఛానెల్‌లో మాట్లాడుతూ.. గాజాలో శాశ్వత యుద్ధాన్ని నివారించే ఏ ప్రతిపాదనను తాము అంగీకరించబోము. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిపాదనలో భాగంగా బందీలు విడుదలకు ప్రతిగా పాక్షిక కాల్పులు విరమణ ఒప్పందానికి మాత్రమే కట్టుబడి ఉన్నాం​. 

 

 హమాస్‌ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. గాజాలో హమాస్‌పై యుద్ధం దాదాపు ముగింపునకు చేరుకుంది. త్వరలోనే ఇజ్రాయెల్‌ విజయం సాధిస్తుందన్నారు. హమాస్‌ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్‌వాసులు సురక్షితంగా తిరిగి వచ్చే వరకు దాడులు జరుగుతూనే ఉంటాయన్నారు.

 అలాగే, గాజాలో పరిపాలనను కూడా పాలస్తీనా అథారిటీకి అప్పగించబోయేది లేదు. ప్రాంతీయంగా ఉన్న కొన్ని దేశాల సహకారంతో గాజాలో పాలన కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు. ఇకపై తాము ఉత్తర సరిహద్దుల్లో లెబనాన్‌ మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లాపై దృష్టి పెడతామని చెప్పారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌ సరిహద్దుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆ మిలిటెంట్‌ సంస్థ దాడులు ఎక్కువయ్యాయి. వాణిజ్యనౌకలపై హూతీల దాడులు ఆగడం లేదు. దీంతో వారిపై ఫోకస్‌ పెట్టినట్టు చెప్పుకొచ్చారు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)