Breaking News

పాలస్తీనాకు ఫేవర్‌గా అంతర్జాతీయ కోర్టు.. చరిత్ర ఇదీ అంటూ నెతన్యాహు..

Published on Sat, 07/20/2024 - 19:55

దిహేగ్‌: పాలస్తీనా, ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇప్పుడు ఇజ్రాయెల్‌ తన ఆధీనంలోకి తీసుకోవడం చట్టవిరుద్దమని కోర్టు పేర్కొంది. ఇజ్రాయెల్‌ దళాలు వెంటనే అక్కడి నుంచి వైదొలగాలని కోర్టు ఆదేశించింది.

వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్‌, పాలస్తీనా అంశంపై తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 15 మంది న్యాయమూర్తుల ప్యానెల్‌ పాలస్తీనా విషయంపై కీలక తీర్పును వెల్లడించింది. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్‌ తమ అధీనంలో తీసుకోవడం చట్ట విరుద్ధం. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాల నుంచి వెంటనే వైదొలగాలని పేర్కొంది. అక్కడ కాలనీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 

 

ఇదే సమయంలో 57 ఏళ్ల కిందట ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాలపై ఇప్పుడు ఇజ్రాయెల్‌ ఆక్రమణలు కరెక్ట్‌ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  అలాగే, వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలెం ప్రాంతాలపై నియంత్రణ, సహజ వనరులను వినియోగించుకోవడం, పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం.. అన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని మండిపడింది. వెంటనే పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్‌ దళాలు వెనక్కి రావాలని ఆదేశించింది.

ఇక, అంతర్జాతీయ కోర్టు ఆదేశాలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు స్పందించారు. కోర్టు తీర్పు హస్యాస్పదమని ఖండించారు. ఆక్రమిత మూడు ప్రాంతాలు యూదుల చారిత్రాక మాతృభూమిలో భాగమన్నారు. అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టబడాల్సిన అవసరమేమీ లేదు. ఇది కేవలం వారి అభిప్రాయం మాత్రమే. కోర్టు చారిత్రాక విషయాలను వక్రీకరించింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాలోని హమాస్‌ కీలక​ నేతలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఇక, ఇజ్రాయెల్‌ దాడుల్లో అమాయక పాలస్తీనియన్లు మృత్యువాతపడుతున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో దాదాపు 80 మంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)