Breaking News

పాలస్తీనియన్లకు భారీ ఊరట.. ఇజ్రాయెల్‌కు కీలక ప్రకటన

Published on Mon, 06/17/2024 - 07:39

జెరూసలేం: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో కాల్పుల విషయంలో ఇజ్రాయెల్‌ ‍మరో కీలక ప్రకటన చేసింది. రఫాలో పగటి పూట(దాదాపు 11 గంటల పాటు) కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, గాజా ప్రజలకు మానవతాసాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.  

కాగా, రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వనున్నట్టు ఇజ్రాయెల్‌ తెలిపింది. పాలస్తీనియన్లకు మానవతా సాయం అందింందే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కాల్పుల విరామం ప్రకటించింది. ఇక, ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్‌ నిర్ణయంతో కొన్ని వారాలుగా మానవతా సాయం అందక ఇబ్బందులు పడుతున్న గాజా ప్రజలకు ఊరట లభించింది.

అయితే, దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో 12 కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న రోడ్డు వెంబడి మాత్రమే కాల్పుల విరమణ కొనసాగనుంది. ఇక, తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కాల్పులు విరామం కొనసాగనున్నట్టు ఐడీఎఫ్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కెరోమ్‌ షాలోమ్‌ క్రాసింగ్‌ దగ్గర వేచి ఉన్న ట్రక్కులు సురక్షితంగా సలాహ్‌-అల్‌-దిన్‌ రోడ్డు మార్గం నుంచి ప్రయాణించగలవు. దీంతో రఫా ప్రాంతానికే కాకుండా ఉత్తర గాజాతో​ పాటుగా మరికొన్ని ప్రాంతాలకు కూడా మానవతాసాయం అందనుంది.

ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్‌ ప్రకటనను సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు నేతలు ఖండిస్తున్నారు. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వంపై ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. మానవతా సాయం అందివ్వడానికి యుద్ధానికి విరామం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌-హమాస్‌ దాడుల నేపథ్యంలో శనివారం ఎనిమిది మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతిచెందారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)