Breaking News

యెమెన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ప్రతిగా హౌతీల క్షిపణి దాడులు

Published on Mon, 07/07/2025 - 10:12

సనా: ఇజ్రాయెల్‌- యెమెన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఓడరేవులు, పలు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెల్లవారుజామున వరుస వైమానిక దాడులకు దిగింది. దీనికి ‍ప్రతిగా హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించారు.

ఎర్ర సముద్రంలో గ్రీకు యాజమాన్యం ఆధీనంలోని కార్గో షిప్ మ్యాజిక్ సీస్‌పై ఆదివారం దాడి జరిగిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. రాకెట్ ఆధారిత గ్రెనేడ్లతో కాల్పులు జరిపిన తర్వాత బాంబులతో కూడిన డ్రోన్లు.. పడవలు, ఓడలను ఢీకొట్టాయని యెమెన్‌ భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంఘటన గురించి హౌతీ మీడియా వెల్లడించినప్పటికీ, అధికారికంగా తమ బాధ్యతను ప్రకటించలేదు.

ఈ ఓడరేవులను హౌతీ ఉగ్రవాదులు ఇరాన్ నుండి ఆయుధాలను రవాణా చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఈ ఆయుధాలను వారు ఇజ్రాయెల్‌తో పాటు దాని మిత్రదేశాలపై ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగిస్తారని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఒక ప్రకటనలో తెలిపాయి. తిరుగుబాటుదారులు అంతర్జాతీయ సముద్ర ట్రాఫిక్‌ను ట్రాక్ చేయడానికి, మరిన్ని దాడులను ప్లాన్ చేయడానికి ఓడలో రాడార్ పరికరాలను అమర్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది.
 

ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులను హౌతీలు అంగీకరించినా, నష్టం  ఏ మేరకు జరిగిందో వెల్లడించలేదు. హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ మాట్లాడుతూ  ఇజ్రాయెల్‌ వైమానిక రక్షణ వ్యవస్థలు దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఇంకా అనిశ్చితంగా ఉంది. అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల తర్వాత.. ఇరాన్ అణు చర్చలపై తన వైఖరి ఏమిటన్నది ఇంకా వెల్లడించలేదు. 
 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు