Breaking News

మరో హెజ్‌బొల్లా టాప్‌ కమాండర్‌ హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్‌

Published on Sun, 11/03/2024 - 07:14

జెరూసలేం: మిలిటెంట్‌ గ్రూప్‌ హెజ్‌బొల్లాకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హెజ్‌బొల్లా టాప్‌ కమాండర్‌ జాఫర్‌ ఖాదర్‌ ఫార్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.

‘దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా నాసర్ బ్రిగేడ్ రాకెట్ యూనిట్ కమాండర్‌ జాఫర్‌ ఖాదర్‌ ఫార్‌. 2023 నుంచి ఇజ్రాయెల్‌పై పలుమార్లు జరిగిన దాడుల్లో జాఫర్‌ ఖాదర్‌ ఫార్‌ కీలక పాత్రపోషించినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇజ్రాయెల్‌లోని గోలాన్‌ ప్రాంతంలో జరిగిన రాకెట్‌ దాడిలో 12మందికి పైగా మరణించారు. 30మంది గాయపడ్డారు. గత బుధవారం హెజ్‌బొల్లా మెటుల్లాపై జరిగిన దాడిలో పదుల సంఖ్యలో మరణించారు. ఈ దాడులకు సూత్రదారి జాఫర్‌ ఖాదర్‌ ఫార్‌’ అని ఇజ్రాయెల్‌ ఆర్మీ పేర్కొంది.

అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8న తూర్పు లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులను హెజ్‌బొల్లా చేపట్టింది. ఇతని ఆధ్వర్యంలోనే ఆ దాడులు చోటుచేసుకున్నట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. 

ఈ దాడులకు ముందు తూర్పు లెబనాన్‌లో సీనియర్‌ హెజ్‌బొల్లా ఆపరేటివ్‌ను బంధించినట్లు ఇజ్రాయెల్‌ నేవీ పేర్కొంది. అయితే, అదుపులోకి తీసుకున్న హెజ్‌బొల్లా ఆపరేటివ్‌ ఎవరనేది వెల్లడించలేదు. మరోవైపు శుక్రవారం బాత్రూన్ లెబనాన్‌కు చెందిన నేవీ కెప్టెన్‌ను కొందరు అపహరించారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్‌ పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు లెబనీస్‌ అధికారులు పేర్కొన్నారు.

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)