Merry Christmas: బాల యేసులు ఎందరో యుద్ధంలో మరణిస్తున్నారు

Published on Tue, 12/26/2023 - 05:00

వాటికన్‌ సిటీ: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ తన సందేశంలో గాజాపై ఇజ్రాయెల్‌ హేయ దాడులను ప్రస్తావించారు. పాలస్తీనియన్ల అపార ప్రాణనష్టానికి హేతువైన ఇజ్రాయెల్‌ దాడులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా చర్చి ప్రధాన బాల్కనీ నుంచి సోమవారం పోప్‌ తన సందేశం వినిపించారు. ‘‘ గాజా సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో బాలలు కన్నుమూస్తున్నారు.

వారంతా నేటి తరం బాల యేసులు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు అక్కడి అమాయక పౌరుల నెత్తుటి పంట పండిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌లో హమాస్‌ మెరుపుదాడి దారుణం. నాడు అపహరించుకుపోయిన వారందర్నీ హమాస్‌ విడిచిపెట్టాలి. ప్రపంచ ఆయుధ విపణి యుద్ధవీణ తంత్రులను మోగిస్తోంది. గాజా, ఉక్రెయిన్, సిరియా, యెమెన్, లెబనాన్, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లలో సైనిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు సమసిపోవాలి.

ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల హక్కులు పరిరక్షించబడాలి. గాజా స్ట్రిప్‌లో మానవతా సాయానికి దారులు తెరచి మానవీయ సంక్షోభాన్ని నివారించాలి’’ అని పోప్‌ వ్యాఖ్యానించారు. విశ్వవ్యాప్తంగా పెరిగిన ఆయుధ కొనుగోళ్లపై స్పందించారు. ‘‘ఆయుధాల ఉత్పత్తి, కొనుగోలు, రవాణా ఊహకందనంత పెరిగిన ఈ తరుణంలో కనీసం శాంతి అన్న పదం మనం ఉచ్ఛరించగలమా?’’ అని పోప్‌ ఆవేదన  వ్యక్తంచేశారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)