Breaking News

Israel-Hamas war: గాజాలో 20,057కి చేరిన మృతుల సంఖ్య

Published on Sat, 12/23/2023 - 04:57

ఖాన్‌ యూనిస్‌: ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంలో సామాన్యులే సమిధలవుతున్నారు. అక్టోబర్‌ 7న ఇరుపక్షాల మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై వైమానిక, భూతల దాడులకు దిగుతోంది. సాధారణ జనావాసాలపై బాంబలు వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 20,057 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది మృత్యువాత పడినట్లు స్పష్టమవుతోంది.

మృతుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. సరిపడా ఆహారం, నీరు అందక గాజాలో జనం ఆకలిలో అల్లాడిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 5 లక్షల మందికి ఆహారం అందడం లేదని వెల్లడించింది. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాకు మానవతా సాయం ఆశించిన స్థాయిలో అందడం లేదని పేర్కొంది. యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరగాల్సిన ఓటింగ్‌ వాయిదా పడింది.                    
 
రెండు రోజుల్లో 390 మంది బలి  
గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం భీకరస్థాయిలో విరుచుకుపడుతోంది. గత రెండు రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్‌ దాడుల్లో ఏకంగా 390 మంది పాలస్తీనియన్లు బలయ్యారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. 734 మంది క్షతగాత్రులుగా మారారని తెలియజేసింది. గాజాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కమ్యూనికేషన్‌ వ్యవస్థ స్తంభించింది. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)