Breaking News

ఒకవైపు లెబనాన్‌లో సంబురాలు.. మరొకవైపు గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు

Published on Thu, 11/28/2024 - 07:14

జెరూసలేం: ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ బాంబు దాడులు నిలిచిపోవడంతో లెబనాన్ వాసులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాడుల కారణంగా దాదాపు 12 లఓల మంది తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లినట్టు సమాచారం.

అగ్ర రాజ్యం అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో లెబనాన్ రాజధాని బీరుట్ సహా పలు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనపిస్తోంది. దాడులు నిలిచిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్ ను విడిచి వెళ్లిపోయిన వారంతా ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా దఓిణ లెబనాన్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.

ఇదిలా ఉండగా..  దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ తాము గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిస్తోంది. దీంతో, కొంత మంది భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. గాజాలో మాత్రం ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 11 మంది పౌరులు చనిపోయారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో వారు చనిపోయారు. గాజాపై 14 నెలలుగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 44వేల మంది చనిపోయారు. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)