Breaking News

అదును చూసి సిరియాను దెబ్బ కొడుతున్న ఇజ్రాయెల్‌!

Published on Thu, 12/12/2024 - 09:07

డమాస్కస్: మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ దేశం నుంచి పారిపోవడంతో సిరియాను అదును చూసి ఇజ్రాయెల్‌ దెబ్బ కొట్టింది. గడిచిన 48 గంటల్లో అక్కడి వ్యూహాత్మక మిలటరీ స్థావరాలపై 400 కంటే ఎక్కువ సార్లు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.  దీంతో సిరియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

24 ఏళ్లుగా సిరియా అధ్యక్ష పదవిలో ఉన్న బషర్ అల్ అసద్ పాలనకు ముగింపు పలికాయి. దీంతో అసద్‌ సిరియా నుంచి రష్యా వెళ్లారు. అసద్‌ దేశం విడిచి వెళ్లారనే  సమాచారంతో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది.

రసాయనిక ఆయుధాలు, రాకెట్లను నిల్వ ఉంచినట్లు అనుమానాలున్న ఆర్మీ స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. 80 శాతంపైగా సైనిక స్థావరాల్ని ధ్వంసం చేసింది.  సిరియా సరిహద్దులో ఇజ్రాయెల్-విలీనమైన గోలన్ హైట్స్‌కు తూర్పున ఉన్న బఫర్ జోన్‌లోకి ఇజ్రాయెల్ తన దళాలను పంపింది.

‘గత 48 గంటల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సిరియాలోని భారీ మొత్తంలో వ్యూహాత్మక ఆయుధాల నిల్వలను ఉంచిన స్థావరాలపై దాడులు చేసింది. వాటిని తీవ్రవాదుల చేతుల్లో పడకుండా నిరోధించాము’అని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది.

ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసిన వాటిల్లో సిరియా నేవీ స్థావరాలు, అల్ బైడా పోర్ట్, లటాకియా పోర్ట్ 15 నౌకాదళ నౌకలు, రాజధాని డమాస్కస్, ఇతర ముఖ్య నగరాల్లోని విమాన నిరోధక బ్యాటరీలు, ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?