Breaking News

సిరియా సైనిక స్థావరాల్లో 80 శాతం ధ్వంసం

Published on Fri, 12/13/2024 - 06:27

ఇజ్రాయెల్‌: సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాల్లో 80 శాతం ప్రాంతాలపై దాడి చేసి ఆ దేశ సైనిక సామర్థ్యాలను చావుదెబ్బతీశామని ఇజ్రాయెల్‌ తెలిపింది. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పాలన అంతమైన కొద్ది రోజులకే సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై తమ సేనలు గురిపెట్టి పని పూర్తిచేశామని ఇజ్రాయెల్‌ తెలిపింది.

 గత 48 గంటల్లో 400కు పైగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ఆక్రమిత గోలన్‌ హైట్స్‌కు తూర్పున ఉన్న నిస్సైనీకరణ(బఫర్‌ జోన్‌) ప్రాంతంలోకి దళాలను పంపామని, 80 శాతం సిరియా సైనిక స్థావరాలను నేలమట్టంచేశామని వెల్లడించింది. ఆయుధ నిల్వలపై దాడి చేసి, అవి తిరుగుబాటుదారుల శక్తుల చేతుల్లో పడకుండా నిరోధించామని తెలిపింది.  

అన్ని రకాల ఆయుధాలు ధ్వంసం 
‘‘అల్‌–బైదా పోర్టు, లటాకియా పోర్టు, డమాస్కస్, ఇతర కీలక నగరాల్లో శత్రు వుల యుద్ధవిమానాలను కూల్చే ఆయుధ వ్యవస్థలు, ఆయుధాగారాలకు చెందిన 15 నావికాదళ నౌకలను ధ్వంసం చేశాం. సముద్రతలంపై 80 నుంచి 190 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు సముద్రతలం నుంచి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణులను ధ్వంసంచేశాం.

 స్కడ్‌ క్షిపణులు, క్రూయిజ్‌ క్షిపణులు, ఉపరితలం నుంచి సముద్రం వరకు, ఉపరితలం నుంచి గగనతలంలోకి, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణు లు, మానవసహిత యుద్ధ వాహకాలు (యూఏవీ), యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, రాడార్లు, ట్యాంకులు, హ్యాంగర్లు తదితర వ్యూహాత్మక ఆస్తులను నిరీ్వర్యం చేశాం’’అని సిరియా సైన్యం పేర్కొంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌ వందలాది దాడులు చేసింది.

అసద్‌ పతనంపై నెతన్యాహు ఏమన్నారంటే..
అసద్‌ పాలన అంతమై రోజు చారిత్రాత్మకమైన రోజు అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అన్నారు. ఇరాన్, అసద్‌లకు ప్రధాన మద్దతుదారులైన హెజ్‌బొల్లాలను తాము చావు దెబ్బ కొట్టిన ఫలితమే అసద్‌ పాలన అంతానికి అసలు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. 

అణచివేత పాలన నుంచి విముక్తి పొందాలనుకునేవారికి స్వేచ్ఛ, సాధికారత ఇజ్రాయెల్‌ కలి్పంచిందని ఆయన ఒక వీడియో ప్రకటనలో చెప్పారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ కమాండర్లను, ఇరాన్‌ మద్దతు ఉన్న పాలస్తీనా హమాస్‌ కీలక నేతలను, లెబనాన్‌ హెజ్‌బొల్లా సీనియర్‌ నాయకులను ఇజ్రాయెల్‌ వరసబెట్టి అనూహ్య దాడుల్లో అంతంచేయడం తెల్సిందే.  
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)