Breaking News

నైజీరియాలో దారుణం.. 300 మంది అపహరణ

Published on Sat, 03/07/2026 - 07:48

నైజీరియాలో దారుణం జరిగింది. నార్త్‌ ఈస్ట్ ప్రాంతంలో ఇస్లామిక్ మిలిటెంట్లు తెగబడ్డారు. ఓ గ్రామంపై దాడి చేసి 300 మందికి పైగా  ప్రజలను అపహరించారు. అయితే ఈ దాడి ఏ గ్రూపుకు చెందిన టెర్రరిస్టులు చేశారనే సంగతి ఇంకా తెలియలేదు.  

నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని బార్నో రాష్ట్రంలో శుక్రవారం  ఇస్లామిక్ మిలిటెంట్లు విరుచుకపడ్డారు. నాగోషి  ప్రాంతంపై  దాడిచేసి మహిళలు, చిన్నపిల్లలతో సహా దాదాపు 300 మందిని కిడ్నాప్ చేశారు. కాగా ఇటీవల టెర్రరిస్ట్ గ్రూపు బొకోహరమ్‌కు చెందిన తీవ్రవాదులను అక్కడి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దానికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిగి ఉండవచ్చని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు.

అయితే గత వారం రోజులుగా తరచుగా  అక్కడి గ్రామాలపై ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని అక్కడి అధికారి తెలిపారు. స్థానికంగా ఉన్న కొండుగ, మార్టే, జకానా, మైనాక్, అనే జాతుల సమూహాలపై మిలీషియా గ్రూపులు దాడులకు తెగబడుతున్నాయన్నారు. వారిని అంతమెుందించడంలో అనేక మంది భద్రతా అధికారులు ప్రాణాలు అర్పించారన్నారు.   

అయితే నైజీరియాలో ఉగ్రవాదుల దాడులు సర్వ సాధారణంగా మారాయి.  అక్కడ మైనింగ్‌పై అధిపత్యం కోసం అక్కడ స్థానికంగా ఉన్న మిలీషియా గ్రూపుల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతాయి. ఈ దాడులలో వందలమంది ప్రాణాలు వదిలారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడడానికి అమెరికా తన బలగాలను నైజీరియాలో మోహరించింది

#

Tags : 1

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)