Breaking News

Iraq: బాలికల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు కుదిస్తూ బిల్లు ప్రతిపాదన

Published on Fri, 08/09/2024 - 18:14

అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో  కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో రూపొందించిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.. అయితే ఇది ఆమోదం పొంది చట్టంగా మారితే వివాహానికి కనీస అమ్మాయి వయస్సు 9 ఏళ్లు ఉండగా.. అబ్బాయి వయస్సు 15 ఏళ్లుకు కుదించనున్నారు.

కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో మహిళ హక్కులను ఇది హరిస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. బిల్లు కానీ పార్లమెంటులో ఆమోదం పొందితే బాల్య వివాహాలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లింగ సమానత్వంతోపాటు మహిళా హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఈ బిల్లు నట్టేట్లో కలిపేస్తుందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ బిల్లు ఆమోదం పొందితే, 9 ఏళ్లలోపు బాలికలు మరియు 15 ఏళ్లలోపు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తారు, ఇది పెరిగిన బాల్య వివాహాలు మరియు దోపిడీల భయాలను రేకెత్తిస్తుంది. ఈ తిరోగమన చర్య మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాల పురోగతిని అణగదొక్కుతుందని విమర్శకులు వాదించారు.

మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్యను ఇది అడ్డుకుంటుందని, వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, గృహ హింస వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్‌ ప్రకారం, ఇఆరక్‌లో 28శౠతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపు వివాహాలుజరుగుతున్నట్లు వెల్లడైంది. అయితే ఇరాక్ గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ అప్పట్లో చట్ట సభ్యుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)