Breaking News

భారత్‌ను ఆశ్రయిస్తున్న ఇరాన్..!

Published on Thu, 01/15/2026 - 01:40

అశాంతి, ఆందోళనలు ఒకవైపు.. యుద్ధం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి బెదిరింపులు.. వెరసి ఇరాన్‌ ప్రభుత్వం కకలావికలం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ను ఆశ్రయించే ప్రయత్నం చేస్తోంది. ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు భారతే అండగా ఉంటుందని ఇరాన్ అధినాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి తాజాగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ స్వయంగా ఎక్స్‌ లో బుధవారం పోస్టు చేశారు. ఆ వెంటనే ఇరాన్‌లోని భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలంటూ విదేశాంగ శాఖ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం..!

అయితే.. తమ మధ్య జరిగిన సంభాషణ వివరాలను జైశంకర్ పంచుకోలేదు. ఇరాన్‌లో పరిస్థితులపై చర్చించినట్లు మాత్రం వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ ద్వారా ఇరాన్ ఇప్పుడు భారత్ మద్ధతు కోరుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే అంశంపై మంగళవారం కూడా మంత్రి జైశంకర్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్(ఐఓఆర్ఏ) సెక్రటరీ జనరల్ సంజీవ్ రంజన్‌తో సమావేశమయ్యారు. ఐఓఆర్ఏ సభ్య దేశాల మధ్య సహకారానికి సంబంధించిన కీలక రంగాలను సమీక్షించారు. ప్రభుత్వాలు, వ్యాపారాలు, విద్యాసంస్థలకు సంబంధించిన సంబంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)