Breaking News

అతనికి ఆహారం తినడమే వికారం..17 ఏళ్లుగా పెప్సీ ఒక్కటే..

Published on Wed, 05/17/2023 - 21:36

ఇంతవరకు ఎందరో వింత వ్యక్తులను వారి ఆహారపు అవాట్లను చూశాం. అవన్నీ ఒక ఎత్తు అ‍యితే ఇతను వాటన్నింటికీ విభిన్నంగా ఉన్నాడు ఇరాన్‌కు చెందని ఓ వ్యక్తి. అతనికి 'ఆకలి' అనేదే తెలియదట. జూన్‌ 2006 నుంచి తినడమే మానేశాడు. ఐతే అతను ఎలా బతుకుతున్నాడు అనే సందేహం అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న.. కానీ అతను ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నాడు. ఎలాంటి అనారోగ్య సమస్య లేదు. 

అసలేం జరిగిందంటే..ఇరాన్‌కి చెందిన ఘోలమ్రేజా అర్దేషిరి జూన్‌ 2006 నుంచి ఆహారం తినడం మానేశాడు. అలా అని అతనికి ఏదైన ప్రమాదం లేదా ఏదైనా జరగకూడని సంఘటన వల్లో అతను ఇలా చేయడం లేదు. ఎలాంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా తినడం మానేశాడు. తనకొక వింత అనుభూతి కలిగిందని. అలా అనిపించినప్పుడల్లా పిచ్చెక్కిపోతుందని, ఏం చేయాలో తెలియనంత బాధగా ఉంటుందని చెబుతున్నాడు అర్దేషిరి. తన నోటిలో ఏదో వెంట్రకలాంటి వస్తువు ఉన్న ఫీలింగ్‌ వస్తుందట. దాని తల భాగం తన గొంతులోనూ మిగతా భాగం పొట్టలో ఉండి అడ్డుపడి, ఊపిరాడనట్లు అనిపిస్తుందట.

ఆ బాధ మాటల్లో చెప్పలేనంటున్నాడు. ఈ విషయమై అనేక మంది వైద్యులను సంప్రదించాడు కానీ ఎవ్వరూ తన సమస్యను నిర్ధారించ లేకపోయారని చెబుతున్నాడు అర్దేషిరి. ఐతే తాను బాగా అలసిపోయినప్పుడూ పెప్సీ వంటి శీతల పానీయాన్ని తాగుతుంటాడు. రోజుకి మూడు లీటర్లు పెప్సీ డ్రిండ్‌ తీసుకుంటాడు. ఒక్కొసారి రాత్రిళ్లు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని చెబుతున్నాడు. అయితే తనకు ఇదేమి షాకింగ్‌ లేదని ఇప్పటికీ ఈ వింత అనుభూతి గల కారణం మాత్రం ఎవ్వరికీ తెలియలేదని చెబతున్నాడు.

అంతేకాదండోయో ఆర్దేషిరి 17 ఏళ్లుగా పెప్సీ ఒక్కటే తాగుతున్నాడు, ఇంకేమి తీసుకోడు. అతని జీవనోపాధి ఫైబర్‌ గ్లాస్‌లు రిపేర్‌ చేయడం. ఐతే అతని ముందేవరు  కుటుంబసభ్యులు భోజనం చేయరట. ఎందుకంటే ఎవ్వరైనా తన ముందు భోజనం చేస్తుంటే వికారంగా ఉంటుందట అందుకని ఎవ్వరూ అర్దేషిరి ఎదుట భోజనం చేయరు. విచిత్రమేమిటంటే ఆ వింత అనుభూతి తప్ప ఏ అనారోగ్య సమస్య లేకపోవడం కొసమెరుపు.

(చదవండి: మరోసారి ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు యత్నం)

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)