Breaking News

ఇరాన్‌ సంక్షోభం.. ఐరాస భద్రతా మండలిలో ఆసక్తికర పరిణామం

Published on Fri, 01/16/2026 - 14:05

ఇరాన్ సంక్షోభం నేపథ్యంతో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. నిరసనలపై ఆందోళన వ్యక్తం చేసిన మండలి.. అమెరికా సైనిక దాడులు జరపడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడింది. అయితే ఎలాంటి తీర్మానం లేకుండా ముగిసిన ఈ భేటీలో.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 

ప్రముఖ జర్నలిస్ట్‌, ఇరాన్‌ మహిళా ఉద్యమకారిణి మసీహ్ అలినెజాద్‌.. యూఎన్‌ భద్రతా మండలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు మండలి భేటీలో పాల్గొన్న ఆమె.. ఇరాన్‌ యూఎన్‌ రాయబారి ఘోలంహోసేన్‌ డర్జీని టార్గెట్‌ చేసుకున్నారు. ‘‘మీరు(ఇరాన్‌) నన్ను మూడుసార్లు చంపాలని చూశారు. నా ఇంటి వద్దకు మనుషుల్ని పంపించారు. వాళ్లను నేను చూశాను కూడా’’ అని వ్యాఖ్యానించారామె. 

ఖమేనీ ప్రభుత్వం ఐసిస్‌లా ప్రవర్తిస్తోందన్న మసీహ్‌..  ఇరాన్‌లో అణచివేతలు మరింతగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో.. అంతర్జాతీయ ఖండనలు ఏమాత్రం సరిపోవని, ప్రపంచ దేశాలు ఇరాన్‌పై ఒత్తిడిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. 

ఇక ఇరాన్‌ ఆందోళనకు అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆ దేశ ప్రతినిధి మైక్ వాల్ట్జ్  ఉద్ఘాటించారు. ఐరాన్‌లో జరుగుతున్న నిరసనలు గొప్ప ఉద్దేశంతో కూడుకున్నవని.. ఐరాన్‌ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని.. మా దేశం, మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వాళ్లతో ఉన్నారు అని స్పష్టం చేశారు. నిరసనలు విదేశీ కుట్ర కాదని.. ఐరాన్‌ ప్రభుత్వం తన ప్రజలకే భయపడుతోందని వాల్ట్జ్‌ అన్నారు.

యూఎన్‌ అధికారులు ఇరాన్‌ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై సైనిక దాడులు జరిగితే ఆ ప్రాంతాన్ని మరింత అస్థిరం చేస్తాయని హెచ్చరించారు.
ఐరాస సెక్రటరీ జనరల్‌ అంటోనియో గుటెరస్ తరఫున మార్థా పోబీ మాట్లాడుతూ.. సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించాలి అని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని పక్షాలు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)