Breaking News

Iran: యాంటీ-వార్‌షిప్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం

Published on Sun, 02/02/2025 - 06:57

ఇరాన్‌ తాజాగా వెయ్యి కిలోమీటర్ల పరిధి సామర్థ్యం కలిగిన నూతన యాంటీ-వార్‌షిప్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. ఇది పర్షియన్ గల్ఫ్‌తో పాటు ఒమన్ సముద్రంలోని  యూఎస్ నేవీ నౌకలను లక్ష్యంగా చేసుకోగలుగుతుంది. ఈ క్షిపణి గదర్-380 టైప్ ఎల్‌ విభాగానికి చెందినది. ఇది యాంటీ-జామింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది శత్రువుల జామింగ్ వ్యవస్థలను కూడా ఆడ్డుకోగలుగుతుంది.

ఈ క్షిపణిని భూగర్భ సౌకర్యాల నుండి ప్రయోగించవచ్చని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్(Iran Revolutionary Guard) నేవీ అధిపతి జనరల్ అలీ రెజా తాంగ్సిరి తెలిపారు. దీనిని ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ప్రయోగించవచ్చు. అయితే ఈ క్షిపణి మోసుకెళ్లే వార్‌హెడ్ గురించి లేదా పరీక్ష సమయం గురించి  ఇరాన్‌ వెల్లడించలేదు. ఈ క్షిపణి వ్యవస్థ గార్డ్ క్షిపణి వ్యవస్థలలో ఒక భాగం మాత్రమే అని, ఈ క్షిపణి శత్రు యుద్ధనౌకలను సమర్థవంతంగా ఎదుర్కోగలదని సమాచారం.

ఈ క్షిపణిని మధ్య ఇరాన్ నుండి ఒమన్ సముద్రం(Oman Sea)లోకి ప్రయోగించారు. ఈ క్షిపణిని నిపుణుడైన ఒక వ్యక్తి ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో సిద్ధం చేసి ప్రయోగించగలడని, ఇది చాలా  ప్రభావవంతంగా ఉంటుందని  ఇరాన్‌ ఒక నివేదికలో పేర్కొంది. ఇరాన్ ఈ క్షిపణిని దక్షిణ తీరంలోని భూగర్భ క్షిపణి కేంద్రం నుండి ప్రయోగించింది. ఈ క్షిపణి శత్రు యుద్ధనౌకలకు చుక్కలు చూపిస్తుందని ఇరాన్‌ పేర్కొంది. 2024లో గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హిజ్బుల్లాతో యుద్ధం  జరుగుతున్న సమయంలో ఇరాన్ రెండు వేర్వేరు సందర్భాలలో ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులను ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థల ద్వారా ఈ క్షిపణులను అడ్డుకుని, నాశనం చేసింది.

ఇది కూడా చదవండి: ఆర్థిక సంక్షోభంలో మాల్‌దీవులు.. స్పందించిన భారత్‌

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)