Breaking News

Bangladesh: ఎట్టకేలకు ఇంటర్నెట్‌ సేవలు.. మూడు రోజులు 5జీబీ డేటా ఫ్రీ

Published on Mon, 07/29/2024 - 09:07

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై బంగ్లాదేశ్‌లో చెలరేగిన అందోళనలు సద్దుమణిగాయి. ఈ నేపధ్యంలో దేశంలో 10 రోజుల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. రిజర్వేషన్ల అంశంపై సోషల్ మీడియాలో  అసంబద్ధ వార్తలు వ్యాప్తి చెందకుండా  ఉండేందుకే దేశంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

దేశంలో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్దరించినట్లు ‍ప్రకటించిన ప్రభుత్వం మూడు రోజుల పాటు వినియోగదారులందరికీ 5 జీబీ డేటా ఇంటర్నెట్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ విషయమై సమాచార, కమ్యూనికేషన్ల సాంకేతిక శాఖ సహాయ మంత్రి (ఐసీటీ) జునైద్ అహ్మద్ పాలక్ అధికారిక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం జూలై 18 నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రిజర్వేషన్ల అంశంపై దేశంలో జరిగిన హింసాయుత ఘటనల్లో సుమారు వందమంది మృతి చెందారు.

యుద్ధ వీరుల బంధువులకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రిజర్వ్ చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలోని ఢాకాతో పాటు ఇతర నగరాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అది హింసాత్మకంగా మారింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఈ హింసాకాండలో 100 మంది మరణించారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక సమాచారం  వెల్లడికాలేదు. మరోవైపు హింసాకాండ నేపథ్యంలో కర్ఫ్యూ విధించాలన్న తన నిర్ణయాన్ని ప్రధాని షేక్ హసీనా సమర్థించుకున్నారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)