Breaking News

ఇండోనేషియాలో విమానం గల్లంతు..

Published on Sun, 01/18/2026 - 04:40

జకార్తా: ఇండోనేషియాలో శనివారం 11 మందితో వెళ్తున్న ఓ ప్యాసింజర్ విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. జావా ద్వీపం నుంచి సులవేసి ద్వీపానికి వెళుతున్న ఈ విమానం పర్వత భూభాగానికి చేరుకోగానే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాన్ని కోల్పోయింది.

ఈ విమానంలో 8 మంది సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం ఆచూకీ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. విమానంలోని ప్రయాణికులు సజీవంగా ఉన్నారా లేదా చనిపోయారా అన్నది ఇంకా అధికారికంగా ధృవీకరణ జరగలేదు.

ప్రమాదం తర్వాత విలేకరుల సమావేశంలో ఇండోనేషియా ప్రభుత్వ మంత్రి మాట్లాడుతూ.. తమ దేశ సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులు విమానంలో ఉన్నారని చెప్పారు. వారు ఈ ప్రాంతంలోని వనరులపై వైమానిక నిఘా నిర్వహించేందుకు వెళ్తున్నారని వెడించారు.

గల్లంతైన టర్బోప్రాప్ ఏటీఆర్ 42-500 విమానం ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ కు చెందినది. రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎండా పూర్నామా సారీ ప్రకారం, మారోస్ జిల్లాలోని లియాంగ్-లియాంగ్ ప్రాంతంలో మధ్యాహ్నం 1:17 గంటలకు (05:17 GMT) విమానం చివరిసారిగా రాడార్లో కనిపించింది. ల్యాండింగ్ కు ముందు, అప్రోచ్ అలైన్‌మెంట్‌ను సరిచేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానాన్ని ఆదేశించిందని  చెప్పారు. కొద్దిసేపటికే రేడియో కాంటాక్ట్ తెగిపోయింది.

విమానం గల్లంతయిన ప్రాంతం కొండ, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో  ఇక్కడికి చేరుకోవడం రెస్క్యూ బృందాలకు పెద్ద సవాలుగా మారింది. సెర్చ్ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు, వైమానిక దళానికి చెందిన గ్రౌండ్ యూనిట్లను మోహరించారు. దక్షిణ సులవేసి హసనుద్దీన్ సైనిక కమాండర్ మేజర్ జనరల్ బంగున్ న్వోకో ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఇంతలో, మౌంట్ బులుస్రాంగ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న కొంతమంది హైకర్లు పర్వతంపై చెల్లాచెదురుగా ఉన్న శిధిలాలు, విమానం లాంటి లోగో, మంటలను చూసినట్లు చెప్పారు. ఈ సమాచారాన్ని నిర్ధారించడానికి సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని మేజర్ జనరల్ నవోకో తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మేఘాలు ఉన్నాయని, అయితే దృశ్యమానత 8 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)