Breaking News

కిర్గిజ్‌స్థాన్‌లో తెలుగువారు సురక్షితం

Published on Mon, 05/20/2024 - 08:14

సాక్షి, అమరావతి: కిర్గిజ్‌స్థాన్‌ (బిష్కెక్‌)లో తెలుగువారు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీఎన్‌ఆర్టీఎస్‌ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కిర్గిజ్‌స్థాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడుల జరుగుతున్న నేపథ్యంలో భారతీయ విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఇందులో భాగంగా కిర్గిజ్‌స్థాన్‌లోని తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసినట్టు ఏపీఎన్‌ఆర్టీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌ మేడపాటి తెలిపారు. ఏపీకి చెందిన ప్రజలు, విద్యార్థులు ఏపీఎన్‌ఆర్టీఎస్‌ 24/7 హెల్ప్‌ లైన్‌ నంబర్లు +91 863 2340678, +91 8500027678 (డబ్ల్యూ)తో పాటు కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 0555710041ను సంప్రదించాలని సూచించారు. ఏపీఎన్‌ఆర్టీఎస్‌ ఈ–మెయిల్స్‌: info@apnrts.com;  helpline@apnrts. com  ద్వారా కూడా సంప్రదించొచ్చని పేర్కొన్నారు. 

భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం ఏపీఎన్‌ఆర్టీఎస్‌ ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మెడిసిన్‌ చదివేందుకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలిసిందని, వీరంతా క్షేమంగా సురక్షిత ప్రదేశాల్లో ఉన్నట్లు తెలిపారు.  

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)