Breaking News

అమెరికాలో భారత విద్యార్థుల వరుస మరణాలు

Published on Thu, 02/01/2024 - 21:11

అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మూడో విద్యార్థి మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా అమెరికాలోని సిన్సినాటిలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. ఆయన గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు.

వివేక్ సైనీ
ఇటీవలే వివేక్ సైనీ(25 ) అనే భారత విద్యార్థిని నిరాశ్రయుడై ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. సైనీ ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దాడికి కొన్ని రోజుల ముందు నుంచి మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్‌నర్ అనే నిరాశ్రయునికి సైనీ సహాయం చేశాడు. అయినప్పటికీ సైనీని ఫాల్క్‌నర్ హత్య చేశాడు.

నీల్ ఆచార్య
ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం రోజుల క్రితం శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఆచార్య. కాగా గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరుసటి రోజే ఆచార్య చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.

ఆదిత్య అద్లాఖా
గత ఏడాది నవంబర్‌లో ఆదిత్య అద్లాఖా(26)అనే భారతీయ విద్యార్థిని దారుణంగా హత్యకు గురయ్యాడు. సిన్సినాటి యూనివర్శిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్‌డీ విద్యార్థి. ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు. మరో కేసులో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ చదువుతున్న అకుల్ ధావన్(18) అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు. 

ఇదీ చదవండి: Jordan Attack: అంతటి అమెరికా సైన్యమే పొరబడింది! ఫలితంగా ముగ్గురు మృతి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)