Breaking News

Ireland: భారత సంతతి యువకునిపై జాత్యహంకార దాడి

Published on Thu, 07/31/2025 - 10:56

డబ్లిన్‌: ఐర్లాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన యువకునిపై జాత్యహంకార దాడి చోటుచేసుకుంది. ఆ యువకుడు తన అపార్ట్‌మెంట్‌కు సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా, అకస్మాత్తుగా ఆరుగురు యువకులు అతనిపై దాడి చేశారు. ఐర్లాండ్‌లో తాను ప్రేరేపిత జాత్యహంకార దాడిని ఎదుర్కొన్నానని భారత సంతతికి చెందిన డాక్టర్ సంతోష్ యాదవ్ ఘటనా క్రమాన్ని ‘లింక్డ్‌ఇన్‌’లో వివరించాడు.

ఐర్లాండ్‌లో జాత్యహంకార యువకుల బృందం తనపై దాడి చేసిందని డాక్టర్ సంతోష్ యాదవ్ ఆరోపించారు.‘నేను రాత్రి భోజనం చేసిన తర్వాత, నా అపార్ట్‌మెంట్ సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా, ఆరుగురు యువకుల బృందం నాపై వెనుక నుంచి దాడి చేసింది. తరువాత వారు నా కళ్లద్దాలను లాక్కొని, వాటిని పగలగొట్టి, నా తల, ముఖం, మెడ, ఛాతీ, చేతులు, కాళ్లపై  ఆగకుండా కొట్టారు. దీంతో నాకు తీవ్ర రక్తస్రావం అయింది. గార్డ్‌కు కాల్ చేసి,విషయం చెప్పాను. అంబులెన్స్ నన్ను బ్లాంచర్డ్స్‌టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. నా చెంప ఎముక విరిగిందని వైద్య బృందం నిర్ధారించింది. ఇప్పుడు నన్ను ప్రత్యేక వైద్యసంరక్షణ కోసం రిఫర్ చేశారు’ అని సంతోష్ యాదవ్ పేర్కొన్నారు.

ఐర్లాండ్‌లో మైనారిటీలపై హింస పెరుగుతున్నదని, అయినా అధికారులు నేరస్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సంతోష్‌ యాదవ్‌ ఆరోపించారు. దాడులు చేశాక వారు స్వేచ్ఛగా పారిపోతున్నారని, తిరిగి దాడి చేయడానికి ధైర్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఐర్లాండ్ ప్రభుత్వం, డబ్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఐర్లాండ్‌లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రాలను సంతోష్‌ యాదవ్‌ తన పోస్టుకు ట్యాగ్ చేశారు.

యాదవ్ తన పోస్ట్‌లో రెండు ఫోటోలను ఉంచారు. ఒక  ఫొటోలో అతని ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లు  ఉండగా, మరొక ఫోటోలో అతని చేతిలో విరిగిన కంటి అద్దాలు  ఉన్నాయి. డాక్టర్ సంతోష్ యాదవ్  లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆయన కాన్పూర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్ పూర్తి చేశాడు. తరువాత ఘజియాబాద్‌లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ నుండి పీహెచ్‌డీ చేసాడు. ప్రస్తుతం సంతోష్‌ యాదవ్‌ సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో  ఉంటున్న ఆయన  ఒక టెక్ కంపెనీకి సహ వ్యవస్థాపకునిగా ఉన్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)