Breaking News

నాసా ‘మూన్‌ టు మార్స్‌’ చీఫ్‌గా మనోడు!

Published on Sat, 04/01/2023 - 04:16

వాషింగ్టన్‌: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘మూన్‌ టు మార్స్‌’ కార్యక్రమం హెడ్‌గా భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, రోబోటిక్స్‌ ఇంజనీర్‌ అయిన అమిత్‌ క్షత్రియ నియమి తులయ్యారు. చంద్రుడిపై సుదీర్ఘ కాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్తర లక్ష్యంతో నాసా ఈ మిషన్‌కు రూపకల్పన చేసింది.

‘మూన్‌ టు మార్స్‌’ కార్యక్రమానికి సారథ్యం వహించనున్న అమిత్‌ క్షత్రియ నాసా ఎక్స్‌ప్లోరేషన్‌ సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ డైరెక్టరేట్‌లో కొత్తగా ఏర్పాటయ్యే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు ఆయన కామన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌ తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. 2003 నుంచి అంతరిక్ష కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు భారత్‌ నుంచి అమెరికా వలస వచ్చారు. క్షత్రియ విస్కాన్సిన్‌లోని బ్రూక్‌ఫీల్డ్‌లో పుట్టారు.
 

Videos

అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ కు బ్రేక్..

గిల్ కోసం కోహ్లి బలి.. ఇదంతా గంభీర్ కుట్ర!

జమ్మూలోని సరిహద్దు గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్

స్పీడ్ పెంచిన మెగా స్టార్.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు

రాజమౌళి సెంటిమెంట్ కి భయపడుతున్న మహేష్ బాబు

ఉగ్రవాదులతోనే మా పోరాటం

భారత్, పాకిస్థాన్ DGMOల భేటీ వాయిదా

దేశంలో 32 విమానాశ్రయాలు రీఓపెన్

బాహుబలి చేప

అందుకే.. తాగుడు వద్దురా అనేది

Photos

+5

గంగమ్మ జాతరలో మంచు మనోజ్ దంపతులు (ఫొటోలు)

+5

మదర్స్‌ డే స్పెషల్.. అమ్మలతో సెలబ్రిటీల పోజులు (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం.. తొలి నటుడిగా రికార్డ్ (ఫొటోలు)

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)

+5

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)

+5

వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంతిమ వీడ్కోలు.. జైహింద్‌.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)

+5

‘లెవన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మిస్‌ వరల్డ్‌ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)