Breaking News

భారత సంతతి మహిళకు తప్పని ఇమ్మిగ్రేషన్ సెగ!

Published on Tue, 01/27/2026 - 01:30

అమెరికాలోని వ‌లస‌దారుల‌పై ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఏజెంట్ల చర్యల వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయినప్పటికి వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురైంది.

ఆమె పట్ల ఐస్‌ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె డాక్టర్ నిషా పటేల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నిషా పటేల్ తెలిపిన వివరాల ప్రకారం..  ఆమె తల్లి టెక్సాస్‌లోని ఒక అవుట్‌లెట్ మాల్‌లో షాపింగ్ చేస్తుండగా, మాస్క్‌లు ధరించిన ఐస్ ఏజెంట్లు తన దగ్గరకు వచ్చి విచారించారు. 

ఆమెను చూసి మాట్లాడుతుందని భావించిన ఏజెంట్లు.. తొలుత ఆ భాషలోనే మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే సదరు మహిళ తనకు స్పానిష్ రాదని చెబడంతో, అయితే ఎక్కడ నుంచి వచ్చావు అంటూ పలు దేశాల పేర్లను చెప్పారు. అయితే ఐష్ ఏజెంట్లకు ఆమె గట్టిగానే సమాధానమిచ్చింది.

"మీలో చాలామంది పుట్టకముందు నుంచే నేను ఈ దేశంలో ఉంటున్నాను" ఆమె బదులు ఇచ్చింది. అయినప్పటికీ ఆమె తన ఫోన్‌లో ఉన్న యూఎస్ పాస్‌పోర్ట్ ఫోటోను చూపించే వరకు అధికారులు విడిచిపెట్టలేదు. కాగా నిషా పటేల్ తల్లి గత 47 ఏళ్లుగా అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆమెకు అక్కడి పౌరసత్వం కూడా ఉంది. అమెరికాలో ప్రస్తుతం అక్రమ వలసదారులను పట్టుకోవడానికి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని నిషా పటేల్ ఆవేదన వ్యక్తం చేసింది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)