ట్రయల్‌ రూమ్‌ @ నెక్ట్స్‌ లెవల్‌ 

Published on Sun, 12/21/2025 - 06:07

కెమెరా క్లోజప్‌లో ఒక హైటెక్‌ టచ్‌ స్క్రీన్‌. పక్కనే కళ్లు జిగేల్మనే రంగురంగుల దీపాలు. బయట వేలాదిమంది సందడి చేసే షాపింగ్‌ మాల్‌. కానీ అందులోని ఓ చిన్న 
గదిలోకి వెళ్లగానే అంతా మాయా ప్రపంచం. మీరు ఎంపిక చేసే సంగీతం బీట్‌కు తగ్గట్టుగా గోడలు రంగులు మారిపోతాయి. అద్దం ముందు నిల్చున్నప్పుడు మీరొక సామాన్య కస్టమర్‌లా.. కాదుకాదు.. ఏదో గ్లామర్‌ వరల్డ్‌ సూపర్‌ స్టార్‌లా ఫీలైపోతారు..

దుబాయ్‌లోని ప్రసిద్ధ హెచ్‌ అండ్‌ ఎం స్టోర్‌లో సార్థక్‌ సచ్‌దేవా అనే భారతీయ యువకుడికి ఒక వింత అనుభవం ఎదురైంది. సాధారణంగా మనం ట్రయల్‌ రూమ్‌లోకి వెళ్తే బట్టలు వేసుకుని చూసుకుని వచ్చేస్తాం. కానీ ఈ స్టైలిష్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ మాత్రం వేరే లెవల్‌. సార్థక్‌ సచ్‌దేవా షేర్‌ చేసిన ఈ వీడియో, షాపింగ్‌ అనుభవాన్ని సాంకేతికత ఎలా మారుస్తుందో కళ్లకు కట్టినట్లు చూపుతోంది. 

నాలుగు రకాల మూడ్స్‌..  
ఆ ట్రయల్‌ రూమ్‌ లోపల ఒక టచ్‌ స్క్రీన్‌ ప్యానెల్‌ ఉంటుంది. అందులో నాలుగు ఆప్ష న్లు ఉంటాయి. ఫుల్‌ ఎనర్జీతో కూడిన సంగీతం.. దానికి తగ్గట్టుగా వేగంగా మారే కాంతి కిరణాలు. ట్రయల్‌ రూమ్‌ లోని టచ్‌స్క్రీన్‌ ప్యానెల్‌ ద్వారా యూజర్లు తమకు నచి్చన సంగీతాన్ని ఎంచుకోవచ్చు. వాటిలో హైప్, వైబ్, చిల్, లోకల్‌ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. 

వైబ్‌: పార్టీ మూడ్‌ని సెట్‌ చేసే విజువల్స్‌. 
చిల్‌: ప్రశాంతమైన సంగీతం, ఆహ్లాదకరమైన రంగులు. 
లోకల్‌: అక్కడి నేటివిటీని ప్రతిబింబించే సంగీతం. 

తాకితే చాలు మతిపోతోంది  
సార్థక్‌ ఒక్కొక్క ఆప్షన్‌ని టచ్‌ చేస్తుంటే.. ఆ గది గోడలపై ఉన్న స్క్రీన్లు డైనమిక్‌ విజువల్స్‌ ప్రొజెక్ట్‌ చేస్తున్నాయి. సంగీతం మారిన ప్రతిసారీ లైటింగ్‌ సింక్‌ అవుతూ సెకన్లలో గది వాతావరణాన్ని మార్చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేయగానే నిమిషాల్లో వైరల్‌ అయిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘దుబాయ్‌ ఎక్కడో ఉందనుకున్నాం.. ఇది నెక్సŠట్‌ లెవల్‌‘ అని ఒకరంటే.. ‘నాకు ఇలాంటి ట్రయల్‌ రూమ్‌ దొరికితే అసలు బయటికే రాను’.. అని ఇంకొకరు సరదాగా వ్యాఖ్యానించారు. 

అందమైన అనుభవాల గది 
సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని ఎంతగా మార్చేస్తుందంటే.. బట్టలు సరిపోయాయో లేదో చూసుకునే ఒక సాదాసీదా గదిని కూడా ఒక మధుర సంగీతానుభవాల లోకంగా మార్చేసింది. షాపింగ్‌ అంటే కేవలం వస్తువు కొనడం కాదు, అదొక అందమైన.. అద్భుతమైన జ్ఞాపకం కూడానని దుబాయ్‌ మరోసారి నిరూపించింది. మీరు కూడా ఇలాంటి ట్రయల్‌ రూమ్‌ లోకి వెళ్తే మొదట ఏ సంగీతం ప్లే చేస్తారో ఊహించుకోండి..! 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)