Breaking News

క్రొయేషియాలో ఇండియా ఎంబసీపై దాడి

Published on Fri, 01/23/2026 - 09:13

క్రొయేషియాలోని భారతీయ రాయభార కార్యాలయంపై  అక్కడి ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడి చేశారు. అక్కడి రాజధాని నగరం జాగ్రెబ్‌లోని భారత రాయభార కార్యాలయంలోకి చొరబడి దాడి చేసి అనంతరం కార్యాలయంపై ఉన్న జాతీయపతాకాన్ని తొలగించారు. దీనిపై భారత విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రొయేషియాను  ఆదేశించింది.

భారత విదేశాంగ శాఖ ఈఘటనపై స్పందిస్తూ "జ్రాగ్రెల్‌లోని మా రాయభార కార్యాలయంపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వియన్నాం కన్వెన్షన్ ప్రకారం రాయభార కార్యాలయాల ఎదుట నిరసన చర్యలు సరైనవి కావు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. రాయభార కార్యాలయాలను రక్షించాలి.ఇటువంటి చర్యలతో  నిందితులు ఉద్దేశం ఏమిటో స్పష్టంగా అర్థమవుతోంది. చట్టం వీటన్నిటిని గమనిస్తూనే ఉంటుంది"అని విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే ఐరోపా ప్రతినిధులు త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ దాడికి సంబంధించిన వీడియోను సిక్స్ ఫర్ జస్టిస్ లీడర్ గురుపట్వానీ సింగ్ పన్నుమ్ ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఖలిస్థానీ వేర్పాటువాదులు భారత పతకాన్ని తీసి దానిపై ఖలీస్థాని జెండా పెట్టారు. అయితే గతేడాది క్రొయేషియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్‌కు మద్దతిస్తున్నందుకు ఆదేశానికి ధన్యవాదాలు తెలిపారు. ఆదేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీ అవడం గమనార్హం.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)