Breaking News

అమెరికాలో రంజనీ శ్రీనివాసన్‌ వీసా రద్దు.. కారణం ఇదే..

Published on Sat, 03/15/2025 - 09:50

వాషింగ్టన్‌: భారత్‌కు చెందిన రంజనీ శ్రీనివాసన్‌కు వీసా రద్దు కావడంతో ఆమె తనంతట తానుగా అమెరికాను వీడారు. పాలస్తీనాకు అనుకూలంగా నిరసనల చేసిందుకు అక్కడి అధికారులు.. ఆమె వీసాను రద్దు చేశారు. దీంతో, రంజనీ శ్రీనివాస్‌ స్వదేశానికి వచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది.

భారత పౌరురాలు, కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, ఆమె పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీసాను రద్దు చేసినట్టు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. అయితే, రంజనీ శ్రీనివాసన్ హింసకు మద్దతు ఇచ్చారనేందుకు వారి వద్ద ఏ ఆధారాలు ఉన్నాయో అధికారులు మాత్రం చెప్పలేదు. ఇక, 2025 మార్చి 5న విదేశాంగ శాఖ ఆమె వీసాను రద్దు చేసినట్టు ప్రకటనలో ఉంది. ఈ క్రమంలో ఆమె అమెరికాను వీడుతున్న వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది. ఈ వీడియోలో లాగార్డియా విమానాశ్రయంలో ఆమె తన లగేజీతో వెళ్తున్నట్టు కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. గతేదాడి పాలస్తీనా-ఇజ్రాయెల్‌ దాడుల సందర్బంగా పాలస్తీనాకు అనుకూలంగా కొలంబియా యూనివర్సిటీలో నిరసనలు చేపట్టిన విదేశీయులపై ట్రంప్‌ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. వారిని అమెరికా నుంచి బహిష్కరించాలని, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదించింది. ఇందులో భాగంగానే పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

విశ్వవిద్యాలయంపై ఒత్తిడి..
ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయం కష్టాలను ఎదుర్కొంటోంది. అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లు, ఒప్పందాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువ భాగం వైద్య పరిశోధనల కోసమే ఉంది. పాలస్తీనాకు సంబంధించిన నిరసనల సమయంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను విమర్శించిన విద్యార్థులు, అధ్యాపకులపై యూనివర్శిటీ కఠినంగా చర్యలు తీసుకోకపోవడానికి శిక్షగా ఈ ఒప్పందాలను రద్దుచేసింది.

భారతీయ విద్యార్ధిని రంజనీ వీసా రద్దు కారణం ఇదే..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)