Breaking News

శుభాన్షు శుక్లా... ఎంటర్‌ ద ‘డ్రాగన్‌’

Published on Sat, 10/19/2024 - 05:37

ప్రతిష్టాత్మక ఆక్సియం స్పేస్‌ ఏఎక్స్‌–4 మిషన్‌కు ఎంపికైన భారత వ్యోమగామి, వైమానిక దళ గ్రూప్‌ కెపె్టన్‌ శుభాన్షు శుక్లా తాము ప్రయాణించబోయే అత్యాధునిక డ్రాగన్‌ వ్యోమనౌకను తొలిసారి సందర్శించారు. అమెరికాలో హూస్టన్‌లోని స్పేస్‌ ఎక్స్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిగతా ముగ్గురు సిబ్బందిని ముఖాముఖి కలుసుకున్నారు. వారంతా కలిసి వ్యోమనౌకలో కాసేపు గడిపారు. 

స్పేస్‌సూట్‌కు కొలతలివ్వడంతో పాటు ప్రెజరైజేషన్‌ తదితర తప్పనిసరి పరీక్షల్లో వారంతా పాల్గొన్నారు. దీంతో వారందరికీ శిక్షణ ప్రక్రియ లాంఛనంగా మొదలైనట్టయింది. ఈ మిషన్‌కు నాసా వ్యోమగామి పెగీ వాట్సన్‌ సారథ్యం వహించనున్నారు. ఇందులో భాగంగా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో 10 రోజుల పాటు పలు ప్రయోగాలు, పరిశోధనల్లో గడుపుతారు. ప్రైవేట్‌ వ్యక్తులు, పరిశోధకులకు ఐఎస్‌ఎస్‌ సందర్శనకు వీలు కలి్పచేందుకు స్పేస్‌ ఎక్స్‌ తలపెట్టిన నవతరం వాణిజ్య అంతరిక్ష యాత్రల్లో ఆక్సియం స్పేస్‌ మిషన్‌ నాలుగోది. ఆక్సియం స్పేస్, స్పేస్‌ ఎక్స్, నాసా భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరుగుతోంది. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు