Breaking News

వివక్షాపూరిత టారిఫ్‌లతో వాణిజ్యానికి విఘాతం 

Published on Sun, 09/28/2025 - 05:27

ఐక్యరాజ్యసమితి/న్యూయార్క్‌: విచక్షణారహితంగా టారిఫ్‌లను విధిస్తూ వాణిజ్య నియంత్రణ చర్యలకు పాల్పడటంపై బ్రిక్స్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి నిర్బంధపూరిత విధానాలతో గ్లోబల్‌ సౌత్‌ దేశాలను అణగదొక్కే ప్రమాదముందని హెచ్చరించాయి. ప్రపంచ వాణిజ్యాన్ని మరింత తగ్గించి, ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీసి, అంతర్జాతీయ ఆర్థికవాణిజ్య కార్యకలాపాలలో అనిశి్చతిని కల్పిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇటువంటి రక్షణాత్మక చర్యలు ప్రస్తుత ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేయడంతోపాటు ప్రపంచ అభివృద్ధి అవకాశాలను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ వార్షిక సమావేశాలకు హాజరైన బ్రిక్స్‌ దేశాల విదేశాంగ మంత్రులు భారత్‌ అధ్యక్షతన శుక్రవారం న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. 2026లో బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టనుండటం తెల్సిందే. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అధ్యక్షతన భేటీ జరిగింది. అనంతరం మంత్రులు అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్‌ పేరును ప్రస్తావించకుండా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశం పహల్గాం ఉగ్రదాడిని కూడా ఖండించింది. 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)