Breaking News

హోర్ముజ్ దాడి: ఇరాన్ రాయబారులకు భారత్ సమన్లు

Published on Tue, 07/14/2026 - 12:07

న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధిలో జరిగిన క్షిపణి దాడిలో భారతీయ నావికుడు మృతి చెందడం, పలువురు గాయపడటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ మహ్మద్ జవాద్ హుస్సేనీతో సహా ఆ దేశ దౌత్యవేత్తలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ  సమన్లు జారీ చేసింది.

ఒమన్ ప్రాదేశిక జలాల్లోని దక్షిణ షిప్పింగ్ లేన్‌లో ప్రయాణిస్తున్న యూఏఈకి చెందిన ‘మొంబాసా’, ‘అల్ బహియా’ అనే రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసినట్లు యూఏఈ వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రేనియన్లతో కలిపి మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ దాడులపై విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి వాణిజ్య నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు వాటా ఉన్న హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం ఇరాన్, అమెరికాల మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)