Breaking News

ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పాదనలో భారత్‌ నంబర్‌ వన్‌

Published on Thu, 09/05/2024 - 07:41

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ఒక  ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది రెండవ అతిపెద్ద ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిదారు కంటే రెండు రెట్లు  అధికం. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఉత్పత్తి అవుతోంది.

ఈ అధ్యయనం ప్రకారం ఈ 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ గ్లోబల్ సౌత్ నుండి వస్తుంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన కోస్టాస్ వెలిస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉత్పత్తి  అవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఒకచోట చేరిస్తే, అది న్యూయార్క్ నగరంలోగల సెంట్రల్ పార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తుకంటే అధికంగా ఉంటుంది. పరిశోధకులు ఈ అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 50 వేలకు పైగా నగరాలు, పట్టణాలలో స్థానికంగా ఉత్పత్తి అయిన వ్యర్థాలను పరిశీలించారు.

ఈ అధ్యయన ఫలితాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం బహిరంగ వాతావరణంలో కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించింది. ప్రపంచ జనాభాలో 15 శాతం మంది నుంచి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పారవేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆగ్నేయాసియా, సబ్-సహారా ఆఫ్రికాలో అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తికి ఇదే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. ఈ 15 శాతం జనాభాలో భారతదేశంలోని 25.5 కోట్ల మంది ఉన్నారు.

నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్యాన్ని విడుదల చేస్తోంది. ఇదేవిధంగా న్యూఢిల్లీ, లువాండా, అంగోలా, కరాచీ, ఈజిప్ట్‌లోని కైరోలు ప్లాస్టిక్ కాలుష్య కారకాల విడుదలలో అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా ఈ విషయంలో నాల్గవ స్థానంలో ఉంది. వ్యర్థాలను తగ్గించడంలో ఆ దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోందని వెల్లడయ్యింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)