Breaking News

మాకు కావాల్సింది భాగస్వాములు.. బోధకులు కాదు: జై శంకర్‌

Published on Sun, 05/04/2025 - 17:29

న్యూఢిల్లీ: యూరోపియన్‌ దేశాలపై భారత విదేశాంగ మంత్రి ఎన్‌ జైశంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు జైశంంకర్‌. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. భారతదేశానికి భాగస్వాములు కావాలని, అంతే కానీ బోధకులు అవసరం లేదని చురకలంటిచారు. న్యూఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ లో జరిగిన ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐస్లాండ్ మాజీ అధ్యక్షుడు  గ్రిమ్సన్ తదితరులతో జరిగిన చర్చావేదికలో యూరప్ తీరును జైశంకర్ బహిర్గతం చేశారు. యూరప్ దేశాల నుంచి భారత్ ఏం కోరుకుంటుదని అడిగిన ప్రశ్నలో భాగంగా జై శంకర్ఇలా సమాధానమిచ్చారు. ‘మనం ప్రపంచాన్ని చూసినప్పుడు, భాగస్వాముల కోసం చూస్తాం. ముఖ్యంగా కొన్ని విదేశాలు చాలా బోధనలు చేస్తారు, వాటిని సొంత దేశంలో ఆచరించరు. కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ ఈ సమస్యతో పోరాడుతున్నాయని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు.

ఇప్పుడు యూరప్ దేశాలు వాస్తవిక వైపు అడుగులు వేయగలరా లేదా అనేది చూడాలి. మనం భాగస్వామ్యాన్ని  చేసుకోవాలంటే,  కొంత అవగాహన ఉండాలి, కొంత సున్నితత్వం ఉండాలి, పరస్పర ప్రయోజనాల పట్ల అవగాహ ఉండాలి, ప్రపంచం ఎలా పనిచేస్తుందో గ్రహించాలి, ఈ విషయంలో కొన్ని యూరప్ దేశాలు సమర్థవంతంగా ఉండగా, మరికొన్ని వెనుకబడి ఉన్నాయన్నారు.

గతంలో కూడా యూరప్ దేశాల తీరుపై జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి సమస్యల్ని ప్రపంచ సమస్యలుగా చూపిస్తారని,  ప్రపంచ సమస్యల్ని మాత్రం వారు పట్టించుకోరంటూ వ్యాఖ్యలు చేశారు. 

#

Tags : 1

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు