Breaking News

‘ఎల్‌ఏసీ’లో ఏం చేద్దాం?.. భారత్‌-చైనా సమీక్ష

Published on Thu, 07/24/2025 - 07:30

న్యూఢిల్లీ: భారత్‌- చైనా దేశాలు తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సమీక్షించాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు తదుపరి చేపట్టాల్సిన చర్యలకు ఏర్పాట్లు చేశాయి. ఢిల్లీలో జరిగిన వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ)సమావేశంలో ఇరుపక్షాలు ఈ అంశాలపై చర్చలు జరిపాయి.

సరిహద్దుల్లో ప్రశాంతత, సాధారణ పరిస్థితి నెలకొనడం, ద్వైపాక్షిక సంబంధాలను క్రమంగా సాధారణీకరించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని ఇరు దేశాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)తెలిపింది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న ప్రత్యేక ప్రతినిధుల (ఎస్‌ఆర్‌) తదుపరి దశ చర్చలకు భారత్‌- చైనా  సిద్ధమయ్యాయని ఎంఈఏ పేర్కొంది. ఈ చర్చలకు భారత ప్రత్యేక ప్రతినిధిగా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి నేతృత్వం వహించనున్నారు.

ఈ చర్చలకు ముందు వాంగ్ భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. గడచిన తొమ్మిది నెలలుగా భారత్‌- చైనాలు ఇరు దేశాల సంబంధాలను సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు వైపులా ఘర్షణ పాయింట్ల నుండి దళాలను విరమించుకున్నప్పటికీ, తూర్పు లడఖ్ ప్రాంతంలో ఎల్‌ఏసీ వెంబడి 60 వేల మంది సైనికులున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం డబ్ల్యూఎంసీసీ చర్చలు జరిగాయి.

2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లోని  గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ  ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత ఏడాది అక్టోబర్ 21న ఖరారైన ఒప్పందం ప్రకారం డెమ్‌చోక్, డెప్సాంగ్  పాయింట్ల నుండి సైనిక దళాలను వెనక్కు మళ్లించారు. గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశంలో  ఇరుదేశాల దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)