Breaking News

2023లో భారత్‌- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి?

Published on Sat, 12/30/2023 - 07:57

భారత్‌లోని తూర్పు లడఖ్‌లో 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత కూడా చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) మోహరించిన అదనపు దళాలను పూర్తిగా ఉపసంహరించుకోలేదు. ఈ విషయంలో చైనా అనుసరించిన వైఖరి కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 2023లో కూడా సాధారణ స్థాయికి రాలేదు. ఈ నేపధ్యంలో జరిగిన పలు దౌత్య, సైనిక చర్చల ఫలితాలు నిరాశనే మిగిల్చాయి.

లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా దళాలతో గతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘర్షణల్లో నలుగురు చైనా సైనికులు మరణించారు. ఈ ఘర్షణ  అనంతరం సరిహద్దుల్లో అప్పటికే కొనసాగుతున్న ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి, లడఖ్‌లోని సరిహద్దుల్లో చైనా వేలాది మంది సైనికులను మోహరించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య రెండు అనధికారిక శిఖరాగ్ర సమావేశాలు జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. పాంగోంగ్ లేక్ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో 2020, మే 5 నుంచి ప్రతిష్టంభన నెలకొంది. 2020, జూన్‌లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారత్, చైనా సైనికుల మధ్య మూడేళ్లకు పైగా ప్రతిష్టంభన నెలకొంది.

చైనా-భారత్ సంబంధాల ప్రస్తుత స్థితికి సంబంధించి చైనాలోని మాజీ భారత రాయబారి అశోక్ కాంత్ మాట్లాడుతూ 2020 నుండి నాలుగు సంవత్సరాలుగా  రెండు వైపులా మోహరించిన అదనపు దళాల ఉపసంహరణకు సంబంధించి గణనీయమైన పురోగతి కనిపించలేదు. చైనా చేపట్టిన ఏకపక్ష చర్య కారణంగా, తూర్పు లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉంది. ఇరు దేశాల సంబంధాలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారతదేశం కృషి చేస్తోందని ఆయన అన్నారు. 

తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరస్పర ఆమోదయోగ్యమైన, వేగవంతమైన పరిష్కారం కోసం భారతదేశం, చైనాలు 20 రౌండ్ల చర్చలు జరిపాయి. ఈ చర్చల ద్వారా ఐదు సంఘర్షణ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకున్నట్లు కాంత్ తెలిపారు. 
సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పితే తప్ప చైనాతో సంబంధాలు సాధారణ స్థాయికి చేరవని భారత్ చెబుతోంది. అయితే ద్వైపాక్షిక సంబంధాలను పక్కనపెట్టి,  సరిహద్దుల్లోని పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలని చైనా.. భారత్‌పై ఒత్తిడి తెస్తోంది.
ఇది కూడా చదవండి: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు!

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)