Breaking News

హసీనాపై కఠిన వైఖరి వద్దు: అమెరికాను కోరిన భారత్‌ !

Published on Fri, 08/16/2024 - 12:17

వాషింగ్టన్‌: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను పదవి నుంచి దించడం వెనుక అమెరికా కుట్ర ఉందన్న ప్రచారం నేపథ్యంలో అమెరికా మీడియా కథనాలు చర్చనీయాంశమవుతున్నాయి. హసీనాను ఒత్తిడికి గురిచేయొద్దని గతంలో భారత్‌ అధికారులు అమెరికాను కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఓ కథనం ప్రచురించింది. 

బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాలు బలపడితే ఆ దేశం ఇస్లామిక్‌ అతివాద శక్తుల కేంద్రంగా మారుతుందని, ఇది భారత్‌ జాతీయ భద్రతకు సవాళ్లను విసురుతుందని అమెరికాకు భారత్‌ తెలిపినట్లు కథనంలో రాసుకొచ్చారు. హసీనాపై కఠిన వైఖరి వద్దని అమెరికాను భారత విదేశాంగవర్గాలు కోరినట్లు కథనం సారాంశం. 2024 ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌లో పలువురిని జైళ్లలో వేయడంపై అమెరికా దౌత్యవేత్తలు  విమర్శించారు. 

అమెరికా ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు పోలీసులపై అప్పట్లో ఆంక్షలు విధించింది. ఈ విభాగం నేరుగా హసీనా కింద పనిచేస్తుందనే ఆరోపణలున్నాయి. దేశంలో హింస చెలరేగడంతో షేక్‌హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వచ్చి ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. హసీనా దేశం విడిచిన బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు