Breaking News

భారత్‍-చైనా అధ్యక్షులు అభినందనలు తెలియపరుచుకున్న వేళ..

Published on Tue, 04/01/2025 - 18:07

బీజింగ్:  గతంలో భారత్-చైనా అంటే ఒక యుద్ధ వాతవారణమే కనిపించేది. భారత్ తో పాకిస్తాన్ ఏ రకంగా కయ్యానికి కాలు దువ్వుతుందో ఆ రకంగానే ఉండేది చైనాతో కూడా. అయితే భారత్-చైనా సంబంధాలు ఇప్పుడు దాదాపు మెరుగైన స్థితిలోనే కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఎక్కడా కనిపించకపోవడమే ఇందుకు ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు.

అయితే భారత్ తో స్నేహ హస్తం కోసం చైనా కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తోంది. భారత్ తో కలిసి ఎలిఫెంట్ డ్రాగన్ డ్యాన్స్ చేయాలంటూ ఇప్పటికే చైనా చాలా సార్లు స్నేహ హస్తాన్ని ఇవ్వమని నేరుగానే అడిగేసింది. దీనికి భారత్ కూడా సానుకూలంగానే స్పందించింది.  చైనాతో స్నేహ పూర్వకంగా కలిసి పని చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రధాని మోదీ కూడా ఇటీవలే స్సష్టం చేశారు. ఇరు దేశాలది ఘనమైన చరిత్ర అని, ప్రపంచ జీడీపీలో ఇరు దేశాలది సగం వాట ఉందంటే భారత్-చైనాలు ఎంత బలమైన దేశాలో అర్థం చేసుకోవచ్చని కూడా ఆ సందర్భంలో మోదీ పేర్కొన్నారు.

భారత్ చైనాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుడు మంగళవారం అభినందనలు తెలుపుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల అధ్యక్షులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

ఇరు దేశాలు మరింత స్నేహ పూర్తకంగా కలిసి పని చేయాలని, భారత్ చైనాల బంధం ఎలిఫెంట్ డ్రాగన్ టాంగో రూపంలో ఉండాలని ఈ సందర్భంగా జిన్ పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఇరు దేశాల సంబంధాలు శాంతియుతంగా, స్నేహపూర్వకంగా మారడానికి మార్గాలను కనుగొనాలని, అంతర్జాతీయ వ్యవహారాల్లో కమ్యూనికేషన్ తదితర వాటిల్లో మరింతగా పెంచుకోవాలని జిన్‌పింగ్ సూచించారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతిని కాపాడడంలో భారత్‌తో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నానని అన్నారు.

భారత ప్రధాని మోదీ ‘మంచి మాట’ చెప్పారు: చైనా

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)