Breaking News

ఇమ్రాన్‌ ఖాన్‌కు బెయిల్‌.. మళ్లీ అరెస్ట్‌కు ఛాన్స్‌?

Published on Fri, 05/12/2023 - 16:18

ఇస్లామాబాద్‌: అవినీతి ఆరోపణల కేసులో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు స్వల్ప ఊరట దక్కింది. శుక్రవారం ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అల్‌ఖాదీర్‌ ట్రస్ట్‌ కేసులో ఇదే కోర్టు బయట నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ని పారామిలిటరీ బలగాలు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 

అల్‌ఖాదీర్‌ ట్రస్ట్‌ భూకబ్జా కేసులో విచారణకు ఇమ్రాన్‌ ఖాన్‌ హాజరవుతూ వస్తుండగా, పారామిలిటరీ రేంజర్ల సాయంతో దర్యాప్తు సంస్థ ఎన్‌ఏబీ ఆయన్ని అరెస్ట్‌ చేసింది. ఆపై కోర్టు ఆదేశాలతో విచారణ కోసం కస్టడీలోకి కూడా తీసుకుంది. ఈ తరుణంలో గురువారం సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఇమ్రాన్‌ఖాన్‌ను గంటలోగా తమ ఎదుట హాజరు పర్చాలని ఆదేశించడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు. 

ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌ సమయంలో ఎన్‌ఏబీ( నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో) వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. ఆయన అరెస్ట్‌ చట్టవిరుద్ధంగా ఉందని, చెల్లుబాటు కాదని పేర్కొంది. తక్షణమే విడుదల చేయాలని ఆదేశించడంతో పాటు ఇవాళ(శుక్రవారం) ఇస్లామాబాద్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది కూడా. 

దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరుకాగా.. అల్‌ఖదీర్‌ ట్రస్ట్‌ భూకబ్జా కేసులో రెండు వారాలపాటు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టు ఊరట ఇచ్చింది. అంతేకాదు.. మే 9వ తేదీ తర్వాత ఖాన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఏ కేసుల్లో ఆయన్ని అరెస్ట్‌ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.  దీంతో ఆయన ఎన్‌ఏబీ కస్టడీ నుంచి రిలీజ్‌ అయ్యారు. అయితే.. 

లాహోర్‌ పోలీసుల బృందం ఒకటి ఇస్లామాబాద్‌కు బయల్దేరడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి అరెస్ట్‌ అవుతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఆయనపై దాఖలైన కేసులకు గానూ ఇవాళ(శుక్రవారం) మరోసారి ఖాన్‌ను అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానిక డాన్‌ కథనం ప్రచురించింది. 

ఇదిలా ఉంటే.. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా మొత్తం 121 కేసులు నమోదు అయ్యాయి. అవినీతితో పాటు ఉగ్రవాదం, హింసను ప్రేరేపించడం, మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం లాంటి తీవ్ర నేరాలు సైతం ఉన్నాయి.

ఇదీ చదవండి: పాక్‌ చరిత్రలోనే అదొక చీకటి అధ్యాయం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)