Breaking News

ఇమ్రాన్‌ పార్టీకి చెందిన 166 మందికి పదేళ్ల జైలు

Published on Fri, 08/01/2025 - 00:54

లాహోర్‌: పదవీచ్యుత పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలో పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్‌ ఖాన్‌ ఇప్పటికే వివిధ ఆరోపణలపై జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెల్సిందే. ఖాన్‌ నిర్బంధాన్ని నిరసిస్తూ 2023 మే 9వ తేదీన పీటీఐ శ్రేణులు దేశవ్యాప్త నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు డజను వరకు సైనిక కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. 

ఈ చర్యలపై ఫైసలాబాద్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు(ఏటీసీ) ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఫైసలాబాద్‌లోని ఐఎస్‌ఐ కార్యాలయ భవనంపై జరిగిన దాడికి సంబంధించి 108 మందికి, పోలీస్‌ స్టేషన్‌పై దాడికి పాల్పడిన 58 మందికి పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. శిక్ష పడిన వారిలో నేషనల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఒమర్‌ అయూబ్, సెనేట్‌లో ప్రతిపక్ష నేత షిబ్లి ఫరాజ్, కీలక నేతలు జర్తాజ్‌ గుల్, సాహిబ్‌జాదా హమీద్‌ రజా ఉన్నారు. 

దోషులుగా ప్రకటించిన వారిలో ఆరుగురు నేషనల్‌ అసెంబ్లీ సభ్యులు కాగా ఒకరు పంజాబ్‌ అసెంబ్లీ సభ్యుడు, ఒక సెనేటర్‌ ఉన్నారు. ఇప్పటికే పీటీఐకి చెందిన 14 మందిని దోషులుగా ప్రకటిస్తూ మే 9వ తేదీన వెలువరించిన తీర్పులో పేర్కొంది. తీర్పును లాహోర్‌ హైకోర్టులో సవాల్‌ చేస్తామని పీటీఐ తాత్కాలిక అధ్యక్షుడు గొహార్‌ అలీ చెప్పారు. ఆగస్ట్‌ 5వ తేదీ నుంచి ‘ఫ్రీ ఇమ్రాన్‌ ఖాన్‌ మూవ్‌మెంట్‌’చేపట్టేందుకు పీటీఐ ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)