Breaking News

‘ఇమ్రాన్‌ఖాన్‌ బ్రతికే ఉన్నాడు.. ’

Published on Sun, 11/30/2025 - 10:38

’కరాచీ: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ హత్య చేయబడ్డాడు అంటూ ఇటీవల వైరల్‌గా మారిన వార్తలను తన అనుచరుడు ఖుర్రాన్‌ జెషాన్‌ ఖండించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ బ్రతికే ఉన్నాడని, అడియాలా జైల్లోనే ఉన్నారని స్పష్టం చేశారు.కాకపోతే ఇమ్రాన్‌ ఖాన్‌ను దేశం విడిచి వెళ్లిపోవాలనే ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. 

ఇమ్రాన్‌ఖాన్‌కు పాకిస్తాన్‌లో ఉన​ ప్రజాదరణ కారణంగా ఆయనకు బెదిరింపులు ఎక్కువైనట్లు తెలిపారు.  జైలు అధికారులు కనీసం ఇమ్రాన్‌ ఫోటోలను విడుదల చేయకపోవడానికి కారణం ఆయనకున్న పాపులారిటీనే కారణమన్నారు.   ఆరోగ్యం క్షీణించి ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ ఫోటోలను విడుదల చేస్తే మళ్లీ ప్రజల నుంచి సరికొత్త తలనొప్పి ఎదురవుతుందని భావించే అధికారులు అందుకు దూరంగా ఉన్నారన్నారు. అదే సమయంలో ఇమ్రాన్‌ను దేశం విడిచి వెళ్లిపోవాలనే ఒత్తిడి మాత్రం​ అధికంగా ఉందన్నారు. 

ఇక ఇమ్రాన్‌ మృతిచెందాడనే రూమర్స్‌పై కూడా ఖుర్రాన్‌ జెషాన్‌ క్లారిటీ ఇచ్చారు. ‘ ఇది నిజంగా దురదృష్టకరం. ఇమ్రాన్‌ ఖాన్‌  కొన్ని నెలలుగా ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఇమ్రాన్‌ను ఎవరూ కలవడానికి లేకుండా చేశారు. ఆఖరికి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసే అవకాశం లేకుండా చేస్తున్నారు.  ఇమ్రాన్‌ పార్టీ పీటీఐ శ్రేణుల్ని కూడా కలవనివ్వడం లేదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇమ్రాన్‌ను తీవ్రంగా ఒత్తిడికి గురిచేస్తున్నారనే విషయం ఈ పరిణామాల్ని బట్టి అర్థమవుతుంది. 

ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేసి విదేశాలకు పంపించే ఒప్పందం చేసుకుంటున్నారు. వేరే దేశానికి పంపిన తర్వాత ఇమ్రాన్‌ ఎటువంటి రాజకీయాలు చేయకుండా ఉండేందుక మాట తీసుకునే యత్నం జరుగుతుందనేది నేను బలంగా నమ్ముతున్నాను. కానీ ఇమ్రాన్‌ ఖాన్‌ వాటికి అంగీకరించరు’ అని పేర్కొ‍న్నారు.. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)