Breaking News

Icon Of The Seas: టైటానిక్‌ కంటే ఐదు రెట్లు పెద్దది

Published on Mon, 07/03/2023 - 05:39

సముద్ర అలలతో పోటీపడేలా ఆశలు ఉప్పొంగేవారికి ఇదో అద్భుతమైన అవకాశం. సముద్ర జలాల్లో ప్రయాణానికి ప్రపంచంలోనే అతి పెద్ద నౌక సిద్ధమైంది. టైటానిక్‌ కంటే ఇది ఐదు రెట్లు పెద్దది. ఈ నౌకలోనే సకల సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచంలోని నౌకల్లో స్వర్గధామంగా మారిన ‘ఐకాన్‌ ఆఫ్‌ ది సీస్‌’ ఇప్పటికే ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుంది. రకరకాల ధరల శ్రేణుల్లో ఈ విలాసనౌకలో అద్భుత ప్రయాణానికి ఏర్పాట్లున్నాయి.

ప్రత్యేకతలివీ..
► ఫిన్లాండ్‌లో మెయర్‌ తుర్కు షిప్‌యార్డ్‌ ఈ నౌకని నిర్మించింది
► రాయల్‌ కరేబియన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు చెందిన ఈ నౌక పేరు ‘ఐకాన్‌ ఆఫ్‌ ది సీస్‌’.
► నౌక పొడవు 1200 అడుగులు, బరువు 2,50,800 టన్నులు,  
► ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది ఉంటారు. 5,610 మంది ప్రయాణించగలరు
► ప్రపంచ వ్యాప్తంగా 40 ప్రాంతాలకు చెందిన విభిన్న ఆహార పదార్థాలు ఈ షిప్‌లో లభిస్తాయి.  
► నౌకలో వాటర్‌పార్క్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఫ్యామిలీలు ఎంజాయ్‌ చేసే సకల సదుపాయాలున్నాయి.  
► వచ్చే ఏడాది జనవరిలో మియామి నుంచి బయల్దేరే ఈ నౌక కరేబియన్‌ సముద్ర జలాల్లో ప్రయాణిస్తుంది.  
► ఈ నౌకలో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్‌ పార్క్‌ ఉంది. దీనికి కేటగిరీ 6 అని పిలుస్తారు. ఈ వాటర్‌ పార్కులో ఆరు స్లైడ్‌లు ఉన్నాయి.  
► ఒక వాటర్‌ స్లయిడ్‌ నుంచి నేరుగా సముద్రంలోకి డైవ్‌ చేసేలా పెట్టారు. కానీ ప్రయాణికుల భద్రత రీత్యా దీనిని వారికి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాల్లేవు.
► జూన్‌ 22న ఈ నౌక విజయవంతంగా మొదటి ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుంది.  
► నౌకలో ఉద్యానవనాలు ఉన్నాయి. పార్కుల్లోనూ ప్రయాణికులు సేద తీరవచ్చు.  
► కాలుష్య నివారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లిక్విఫైడ్‌ నేచరల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ)ను ఇంథనంగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణం కొనసాగిస్తుంది.   
► వచ్చే ఏడాది జనవరిలో మియామి నుంచి ప్రారంభమయ్యే ఈ నౌకలో ప్రయాణం కోసం ఇప్పటికే రికార్డు స్థాయిలో టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.  
► వివిధ రకాల ప్యాకేజీల కింద ధరలున్నాయి. అన్నింటికంటే తక్కువగా ఏడు రాత్రులు ఓడలో గడపాలంటే 3 వేల పౌండ్ల (రూ. 3 లక్షలకు పైన ) వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.  
► కరేబియన్‌లో అత్యంత అందమైన దీవులైన బహమాస్, కొజుమెల్, ఫిలిప్స్‌బర్గ్, సెయింట్‌ మార్టెన్, రోటన్, హోండురస్‌ వంటి వాటి మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుంది.  
► వినోదమే ప్రధానంగా రూపొందించిన ఈ షిప్‌లో జరీ్నకి సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)