Breaking News

ట్రంపరితనం.. పిల్లాడిని వదల్లేదు!

Published on Fri, 01/23/2026 - 09:45

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలో ఐదేళ్ల బాలుడు లియామ్ కోనేజో రామోస్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై దుమారం చెలరేగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం ఖండించారు. చిన్నారుల్ని ఇలా అరెస్టు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ చర్యను సమర్థించింది.

మిన్నెసోటాలోని కొలంబియా హైట్స్ ప్రాంతంలో ప్రీ-స్కూల్‌ నుంచి ఇంటికి చేరుకున్న లియామ్‌ను ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ)అధికారులు అదుపులోకి తీసుకున్నారు.బాలుడితో పాటు అతని తండ్రిని నిర్భందించి తీసుకెళ్లారు. ఇలా చిన్నారుల్ని అదుపులోకి తీసుకోవడం గత రెండు వారాల్లో అదే స్కూల్‌ జిల్లాలోని నాలుగు విద్యార్థులను ఐసీఈ అధికారులు అదుపులోకి తీసుకున్నారని స్థానిక పాఠశాల అధికారులు వెల్లడించారు.

అదుపులోకి తీసుకున్న అనంతరం ఐసీఈ అధికారులు చిన్నారిని ‘ఎర’గా ఉపయోగించారని ఆరోపించారు. ఐదేళ్ల బాలుడిని ఎందుకు అదుపులోకి తీసుకోవాలి? ఇది మానవత్వానికి విరుద్ధం’ అని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రంప్ బృందం ఈ చర్యను చట్టపరమైన అమలు చర్యగా సమర్థించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాము ఎలాంటి తప్పు చేయలేదు’ అని స్పష్టం చేసింది.

ఈ ఘటన అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలపై చర్చకు దారి తీసింది. ప్రజలు,పాఠశాల అధికారులు, మానవ హక్కుల సంస్థలు చిన్నారులను ఇలాంటి చర్యల్లో భాగం చేయడం అమానుషం’ అని విమర్శలు గుప్పిస్తున్నారు.  ‘He is just a baby’అనే ట్యాగ్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.   

 


 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)