Breaking News

వాళ్లలా నేనూ రేపిస్ట్‌నే

Published on Wed, 09/18/2024 - 06:05

అవిగ్నోన్‌(ఫ్రాన్స్‌): అత్యంత జుగుప్సాకరమైన, అమానవీయ ఘటనకు వేదికగా నిలిచిన ఫ్రాన్స్‌లోని అత్యాచారాల పర్వంలో ప్రధాన నిందితుడు, బాధితురాలి మాజీ భర్త ఎట్టకేలకు తన తప్పును ఒప్పుకున్నాడు. తనను క్షమించాలని మాజీ భార్య, తన ముగ్గురు పిల్లలను వేడుకున్నాడు. అవిగ్నోన్‌ పట్టణంలోని కోర్టులో సెప్టెంబర్‌ రెండో తేదీన కేసులో వాదోపవాదనలు మొదలెట్టాక తొలిసారిగా నిందితుడు మంగళవారం తన తప్పును ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇచ్చారు. మిగతా రేపిస్టుల్లాగే తాను కూడా భార్యను రేప్‌చేశానని ఏడుస్తూ చెప్పాడు.

 వాంగ్మూలం ఇచ్చిన సమయంలో ప్రధాన నిందితుడితోపాటు దాదాపు 50 మంది ఇతర రేపిస్ట్‌ నిందితులూ కోర్టు హాలులోనే ఉన్నారు. గతంలో ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసిన 71 ఏళ్ల డొమినిక్‌ పెలికోట్‌ తన భార్య గిసెలీకి భోజనంలో మత్తు మందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లాక ముక్కూముఖం తెలియని, దారిన పోయే వాళ్లను పిలిచి మరీ రేప్‌ చేయించాడు. ఇలా 72 మంది గిసెలీని 92 సార్లు రేప్‌చేశారు. ఈ అత్యాచారపర్వం పదేళ్లపాటు అంటే 2011 నుంచి 2020దాకా కొనసాగింది. అయితే 2020లో ఒక సూపర్‌మార్కెట్లో అమ్మాయిలను స్కర్టుల కింది నుంచి వీడియోలు తీస్తూ పెలికోట్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. 

దీంతో ఇంటికొచ్చి అతని వస్తువులకు పోలీసులు తనిఖీచేశారు. దీంతో ఫోన్, కంప్యూటర్‌లో వెలుగుచూసిన అంశాలు చూసి పోలీసులే విస్తుపోయారు. భార్యను అపరిచితులు రేప్‌ చేస్తున్న డజన్ల కొద్దీ వీడియోలు, ఫొటోలు అందులో ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్‌ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న పెలికోట్‌ మంగళవారం కోర్టులో మాట్లాడాడు.  ‘‘ ఎవరూ తప్పుడు నడవడికతో పుట్టరు. పరిస్థితులు అలా మారుస్తాయి’’ అని అన్నారు. నేరం రుజువైతే పెలికోట్‌కు కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. పెలికోట్‌ భార్యను రేప్‌ చేసిన వారిలో 26 ఏళ్ల యువకుల నుంచి 74 ఏళ్ల వృద్దుల వరకు ఉన్నారు. మత్తులోకి జారకముందే ఆమె తన సమ్మతి తెలిపిందని, భర్త తమతో ఇలా చేయిస్తున్నట్లు తమకు నిజంగా తెలియదని వారిలో చాలా మంది చెప్పడం గమనార్హం.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)