Breaking News

అమెరికాను భయపెడుతోన్న‌ మరో తుఫాను: భయం గుప్పిట్లో ఫ్లోరిడా

Published on Wed, 10/09/2024 - 10:15

ఫ్లోరిడా : హెలెన్‌ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి బయటపడకముందే అమెరికాను మరో తుఫాను భయపెడుతోంది. ఫ్లోరిడా తీరం వైపు మిల్టన్‌ హరికేన్‌ దూసుకొస్తోంది. మిల్టన్‌ ఐదో కేటగిరీ హరికేన్‌గా బలపడిందని, అత్యంత శక్తిమంతమైన ఈ తుఫాను వల్ల ప్రాణహాని ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫ్లోరిడా పశి్చమ తీరం వైపు కదులుతున్న మిల్టన్‌.. బుధవారం తీరం దాటే అవకాశం ఉంది. 

తుఫాను ఉధృతితో బుధవారం తెల్లవారుజామునుంచే తీవ్రమైన గాలులు వీస్తాయని ఎన్‌హెచ్‌సీ హెచ్చరించింది. మిల్టన్‌ ఐదో కేటగిరీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత స్థానాలకు తరలిస్తున్నారు. ఈ అతిపెద్ద తరలింపు ప్రయత్నానికి సిద్ధం కావాలని గవర్నర్‌ రాన్‌ డిసాంటిస్‌ ప్రజలను కోరారు. మిల్టన్‌ మార్గంలోని విమానాశ్రయాలు మూసివేశారు. తుఫాను హెచ్చరికలతో ప్రజలు తమ ఇళ్ల నుంచి ఒకేసారి బయటకు రావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.  

మిల్టన్‌ తుఫాను.. హరికేన్లను వర్గీకరించడానికి ఉపయోగించే సాఫిర్‌–సింప్సన్‌ స్కేలుపై మిల్టన్‌ ఐదో కేటగిరీగా నమోదైనది. ఈ తుఫాను సమయంలో గాలులు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. మొదట రెండో కేటగిరీలో ఉన్న తుఫాను కొన్ని గంటల్లోనే 5వ కేటగిరీకి మారింది. ఇంత వేగంగా తుఫాను బలపడటం నమ్మశక్యంగా లేదని ఫ్లోరిడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతా ఈ హరికేన్‌ బలపడిందంటున్నారు. 

ఒక శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాను ఇదే కావచ్చని చెబుతున్నారు. హరికేన్లు మూడో కేటగిరీ దాటితేనే తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. గత నెలలో ఫ్లోరిడాను తాకిన హెలెన్‌ తుఫాను నాలుగో కేటగిరీకి చెందింది. గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో ఆస్తి నష్టం జరిగింది. దీని ధాటికి నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టేనస్సీ, వర్జీనియాలో దాదాపు 230 మంది మరణించారు. ఇంకా మృతదేహాలను వెలికి తీస్తూనే ఉన్నారు. సాధారణం కంటే 2024 హరికేన్‌ సీజన్‌ తీవ్రంగా ఉందని నేషనల్‌ ఓషియానిక్‌ అటా్మస్ఫియరిక్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఓఏఏ) అంచనా వేసింది. మానవుల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్ట ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది.  

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)