Breaking News

డబ్బే డబ్బు.. లెక్కపెట్టింది తీసుకెళ్లండి..!

Published on Fri, 02/27/2026 - 11:54

ఈ కాలంలో కార్పొరేట్ కంపెనీలు తమ ఎంప్లాయిస్‌కి  షాకింగ్‌ న్యూస్‌తో దడపుట్టిస్తున్నాయి. రాత్రికి రాత్రి జాబులు పోయాయంటూ మెయిల్స్ పంపి ఉద్యోగులను షాక్‌కు గురిచేస్తున్నాయి. అయితే చైనాలో మాత్రం ఓ కంపెనీ తమ ఉద్యోగులకు సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. అయితే అది జాబులు ఉస్టయ్యాయంటూ కాదు.. మీరు లెక్కపెట్టగలిగే డబ్బు తీసుకెళ్లండంటూ ఛాలెంజ్ విసిరింది. 

చైనాకు చెందిన హోనాన్ కువాంగ్షాన్ క్రేన్‌కో వ్యాపార సంస్థ తన వార్షిక లాభాలను ఉద్యోగులకు పంచాలని నిశ్చయించుకుంది. అయితే సాధారణంగా కాకుండా కొంత కొత్తగా ఉండాలని ఆ కంపెనీ సీఈఓ కుయ్ పెనుజున్ వినూత్నంగా ప్లాన్ చేశారు. తమ ఉద్యోగస్థులందరీకి డబ్బులు పంచడానికి  ఒక పోటీ పెట్టారు.

800 టేబుళ్లలో వందల కోట్ల డబ్బు కట్టలని ఉంచారు. వారికి నిర్ణీత సమయం పెట్టి ఆ టైమ్‌లో వారు లెక్కపెట్టిన డబ్బంతా వారి సొంతం అన్నారు. దీంతో  ఆ సంస్థ ఉద్యోగులంతా ఆశ్చర్యపోయారు. ఇంకేంటి చకాచకా డబ్బులెక్కపెట్టి అందిన కాడికి సోమ్మును తీసుకెళ్లారు. కొంతమంది ఉద్యోగులైతే వారు లెక్కపెట్టిన డబ్బును మోయలేక ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నారు.

అయితే ఇంచ డబ్బు ఇచ్చినా ఆ యజమాని  సంతృప్తి చెందలేదు. అయినప్పటికీ తమ ఉద్యోగులకు ఇంకా ఏదో చేయాలని ఆలోచించిన ఆ బాస్ ఒక్కక్కరికి తలా 20 వేల యువాన్లు రూ 2.44 లక్షలు ఇచ్చారు.  దీంతో ఉబ్బితబ్బిబ్బవడం ఆ ఎంప్లాయిస్ వంతయింది. అయితే ఈ మనీ వేడుకలో మెుత్తంగా 70 శాతం లాభాలు  రూ. 236 కోట్లు ఉంచినట్లు తెలుస్తుంది.

కాగా ఈ మనీ వేడుకపై కుయ్ పెనుజున్ స్పందించారు. తమ సంస్థ ఉద్యోగస్థులందురూ  వివిధ రకాలైన ఆర్థిక కష్టాలతో ఉన్నారని కనుక ఈ డబ్బులు వారికి కొంత మేర ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా 2 వేల మంది మహిళ ఉద్యోగులకు రూ.2.1 కోట్లు స్పెషల్ బోనస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవేకాకుండా గతంలోనూ ఈయన పలు దాతృత్వ కార్యక్రమాలు జరిపినట్లు ఎంప్లాయిస్ తెలిపారు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)