Breaking News

రోబోలు ఆపరేషన్‌ చేశాయి! 

Published on Sat, 07/11/2026 - 04:36

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హ్యూమనాయిడ్‌ రోబోలు (మనుషుల్లా వ్యవహరించేవి) ఒకటి కాదు.. రెండు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (శాన్‌డియాగో) శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. ఒక ఆపరేషన్‌లో సర్గీ అనే రోబోను ఒక వైద్యుడు రిమోట్‌ కంట్రోలర్‌ సాయంతో పని చేయించి పిత్తాశయాన్ని (గాల్‌బ్లాడర్‌) తొలగించగా... రెండు హ్యూమనాయిడ్‌ రోబోలు తమలో తాము మాట్లాడుకుంటూ రెండో ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. 

ఈ ప్రయోగం వివరాలు అంతర్జాతీయ ప్రఖ్యాత సైన్స్‌ జర్నల్‌ ‘నేచర్‌’జూలై ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమయ్యాయి.  వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోబోలతో శస్త్రచికిత్సలు చేయించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. తరచూ ఇలాంటి వార్తలు చదువుతూనే ఉంటాం. అయితే ఇందులో చాలా పరిమితులున్నాయి. మొదటగా వీటి బరువు ఇంట్యూటివ్‌ సర్జికల్స్‌ వారి డావిన్సీ సర్జికల్‌ సిస్టమ్‌ 820 కిలోల వరకూ బరువు ఉంటే సీఎంఆర్‌ సర్జికల్స్‌కు చెందిన వెరిసియస్‌ 450 కిలోలు ఉంటుంది. మెడ్‌ట్రానిక్‌ కంపెనీ తయారు చేసిన హ్యూగో ఆర్‌ఏఎస్‌ సుమారు 540 కిలోల బరువు ఉంటుంది.

 వీటిని ఆపరేషన్‌ థియేటర్లలో అమర్చడం పని చేయించడం కష్టమైన వ్యవహారం. ప్రత్యేక నైపుణ్యాలున్న సిబ్బంది అవసరం. పైగా ఒక్కోటి కొన్ని రకాల సర్జరీలు మాత్రమే చేయగలదు.హ్యూమనాయిడ్‌ రోబోలు ఈ పరిమితులన్నింటినీ అధిగమించగలవని అంచనా. కాలిఫోర్నీయా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఉపయోగించిన హ్యూమనాయిడ్‌ రోబో సర్గి ఐదు అడుగుల ఎత్తు, సుమారు 27 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఆపరేషన్‌ థియేటర్‌కు నడుచుకుని రాగలదు. సర్జికల్‌ రోబోలతో పోలిస్తే చౌక. ప్రపంచంలో ఏ మూలలోనైనా ఇట్టే ఉపయోగించవచ్చు. 

పేద, మధ్యాదాయ దేశాల్లో, వనరులు, వసతులు తక్కువగా ఉన్నచోట్ల ఈ హ్యూమనాయిడ్‌ రోబోలు ప్రాణాలు నిలిపే కీలకమైన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగపడతాయని కాలిఫోర్నీయా వర్సిటీ ఇంజినీర్‌ మైకెల్‌ ఇప్‌ తెలిపారు. సర్జరీకి అవసరమైన కత్తులు, ఇతర పరికరాలను పట్టుకునేందుకు అడాప్టర్లను ప్రత్యేకంగా తయారు చేశామని, వీటితో పనిచేయించడం పెద్ద కష్టమేమీ కాలేదని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న సర్జన్‌ నికితా తరేజా తెలిపారు. ఈ హ్యూమనాయిడ్‌ రోబోలు ఆపరేషన్‌ థియేటర్‌లో ఎంత బాగా సర్దుకుపోయాయో చూసి ఆశ్చర్యపోయామన్నారు. తొలి ఆపరేషన్‌లో సెర్గిని పదే పదే రీకాలిబరేట్‌ చేయాల్సి వచ్చిందని, దీనివల్ల కొంత ఎక్కువ సమయం పట్టిందని వివరించారు. 
           
– సాక్షి, నేషనల్‌ డెస్క్

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)